ఓటీటీల్లో ఎప్పటికప్పుడు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ శుక్రవారం 12కి పైగా మూవీస్-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే మరో తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
'కేజీఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాల‍్ని అప్పుడప్పుడు తీస్తున్నారు. గతేడాది ఇలానే 'కబ్జ' మూవీ తీయగా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ తరహా యాక్షన్ స్టోరీతో తీసిన మరో సినిమా 'మార్టిన్'. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన కన్నడ డబ్బింగ్ చిత్రం.. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత మాయమైపోయింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)
ఇప్పుడు ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో తెలుగులో హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా.. ఈ సినిమాకు స్టోరీ అందించగా, ఇతడి మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా నటించాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.
విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోవడం, రవి బస్రూర్.. గతంలో తాను పనిచేసిన 'కేజీఎఫ్' లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి ఇవ్వడం లాంటి చాలా మైనస్‌లు ఈ మూవీలో ఉన్నాయి.
(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)
Comments
Please login to add a commentAdd a comment