OTT: కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ తెలుగులో.. అప్పుడే ట్రెండింగ్‌లో | Kannad Super Hit Movie Teeangers Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో ట్రెండింగ్‌

Published Sat, Sep 21 2024 7:45 PM | Last Updated on Sat, Sep 21 2024 8:00 PM

Kannad Super Hit Movie Teeangers Streaming On This OTT Platform

కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగులో వచ్చింది. ఈ మూవీ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. ప్రస్తుతం యూత్  ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చక్కగా చూపించారు. 

అంతర్జాతీయ అవార్డులు
ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేందుకు సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. 

ఆహాలో ట్రెండింగ్‌
పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు. ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఆహాలో టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement