![Kannada Film Love li Movie Streaming On This OTT Platform](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/8/lovelimovie%60.jpg.webp?itok=aBLFLlR-)
కేజీఎఫ్ ఫేం వశిష్ట సింహ హీరోగా నటించిన కన్నడ చిత్రం లవ్‌లీ. స్టెఫీ పటేల్ హీరోయిన్ నటించింది. చేతన్ కేశవ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్, సాధుకోకిలక కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా వశిష్ట సింహా.. నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, కేజీఎఫ్, డెవిల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ 2లో విలన్‌గా కనిపించేనున్నాడు. స్టెఫీ పటేల్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ తెలుగులో నిన్ను తలచి, చెప్పాలని ఉంది వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.
Kannada film #LoveLi (2024) by @ChethanKeshav6, ft. @ImSimhaa @StefyPatel #AchyuthKumar @MalavikaBJP #SadhuKokila #Sameeksha #KavyaShetty & #HGDattatreya, now streaming on @PrimeVideoIN.@abhuvanasa @AnoopSeelin pic.twitter.com/DD804MyqaE
— CinemaRare (@CinemaRareIN) August 8, 2024
Comments
Please login to add a commentAdd a comment