రీసెంట్‌గా రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా.. మూడు రోజుల క్రితం ఒక ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్)
ఒకప్పుడు తెలుగులో హీరోగా చేసిన అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా ప్రస్తుతం కన్నడలో హీరో. ఇతడి లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. దసరాకి కన్నడతో పాటు తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఘోరమైన కంటెంట్ వల్ల దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత వేగంగా మాయమైపోయింది.
మొన్న శుక్రవారం ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అంటే చూడలేకపోయారు గానీ ఓటీటీలో కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తారేమో? విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'ని కాపీ కొట్టాలనుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️!
Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm— ahavideoin (@ahavideoIN) November 19, 2024

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
