రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కాంతార' ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
(చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు)
తాజాగా కాంతార చిత్రబృందానికి భారీ ఊరట లభించింది. వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీనిపై విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. వరాహ రూపం పాట ప్రదర్శనపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. కాగా.. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు.
అందువల్లనే ఓటీటీలోనూ ఆ పాటను ప్రదర్శించలేదు. ఈ పాట కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అడ్డంకులు తొలగిపోవడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఆ పాట అందుబాటులోకి రానుంది. కాంతార మూవీ క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట, రిషబ్‌శెట్టి నటన ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. ఇవాళ కోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment