Kerala Court
-
సవతి కుమార్తెపై అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష
మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అష్రాఫ్ ఏఎం నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా రూ.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపార -
'కాంతార'కు భారీ ఊరట.. వారికి ఊహించని షాక్.!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక సినీ ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కాంతార' ఎట్టకేలకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. (చదవండి: Kantara OTT : కాంతార ఓటీటీలో బిగ్ ట్విస్ట్.. బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజన్లు) తాజాగా కాంతార చిత్రబృందానికి భారీ ఊరట లభించింది. వరాహరూపం పాటపై మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. దీనిపై విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. వరాహ రూపం పాట ప్రదర్శనపై మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. కాగా.. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని 'వరాహరూపం' తీశారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అందువల్లనే ఓటీటీలోనూ ఆ పాటను ప్రదర్శించలేదు. ఈ పాట కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అడ్డంకులు తొలగిపోవడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఆ పాట అందుబాటులోకి రానుంది. కాంతార మూవీ క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట, రిషబ్‌శెట్టి నటన ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేని పరిస్థితి. కానీ ఇటీవలే మలయాళ బ్యాండ్ 'తెయ్యికుడుం బ్రిడ్జ్' ఈచిత్రంలోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. ఇవాళ కోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది. -
కేరళ కోర్టు సంచలన వ్యాఖ్యలు.. మహిళలు రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తే..
తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు లైంగిక వేధింపుల కేసు నిలబడదని వ్యాఖ్యనించింది. లైంగిక వేధింపుల కేసులోని నిందితుడిగా ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (ఎ) ప్రకారం మహిళ లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు ఆ ఫిర్యాదు చెల్లదని తెలిపింది. అసలేం జరిగిందంటే..ఈ ఏడాది ఫిబ్రవరి 8న కోజికోడ్ జిల్లాలోని నంది బీచ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కవితా శిబిరంలో చంద్రన్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి జూలై 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా తన చేయి పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడని ఆరోపించింది. అక్కడ తన ఒళ్లో కూర్చోవాలని అడిగాడని, ఛాతీ నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత కూడా తనకు పదే పదే ఫోన్లు చేస్తూ లైంగికంగా వేధించాడని తెలిపింది. యువతి ఫిర్యాదులో చంద్రన్‌పై 354ఎ (2), 341, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఈ కేసుపై కోజికోడ్ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోజికోడ్ సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.కృష్ణకుమార్.. చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. తీర్పు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. యువతి చేసిన ఫిర్యాదు నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. నిందితుడు బెయిల్ దరఖాస్తుతోపాటు అందజేసిన ఫోటోగ్రాఫ్స్‌ను పరిశీలిస్తే యువతి(బాధితురాలు) ఆ సమయంలో కావాలనే లైంగికంగా ప్రేరేపించే దుస్తులను ధరించినట్లు ఉందని అన్నారు. సెక్షన్ 354ఏ ప్రకారం అమ్మాయి రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే ఈ కేసు నిలబడదన్న జడ్జి.. 74 ఏళ్ల దివ్యాంగుడైన చంద్రన్ యువతిని బలవంతంగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె ఛాతిని నొక్కాడనే అరోపణలు నమ్మేలా లేవని తోసిపుచ్చారు. కాబట్టి నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు -
లైంగిక వేధింపుల కేసు.. ఉచ్చు బిగుస్తోందా?
సాక్షి, కొచ్చి : మళయాళ నటి భావనపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో స్టార్ నటుడు దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ఇందులో మొత్తం 12 మంది నిందితుల పేర్లను పోలీసులు ప్రస్తావించారు. ఇక ఛార్జ్ షీట్‌ను అంగీకరించటంతోపాటు దిలీప్‌తోపాటు నిందితులందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మొదటి ఛార్జీ షీట్ లో తొలుత ప్రధాన నిందితుడిగా దిలీప్ పేరును ప్రస్తావించిన పోలీసులు సరైన సాక్ష్యాలు లభింకపోవటంతో ఆయన పేరును 8వ నిందితుడిగా మార్చారు. ఆ ఛార్జ్‌షీట్‌ను నవంబర్ 22న అంగమళి మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. మొత్తం 650 పేజీల ఛార్జ్‌షీట్.. 50 మంది సాక్ష్యులు, 12 మంది నిందితుల పేర్లను ఇందులో ప్రస్తావించారు. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ పేరును ప్రధాన సాక్షిగా పేర్కొనటం విశేషం. ఆమె నుంచి కీలక సమాచారం విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 17న కోయంబత్తూరులో నటి భావనపై లైంగిక దాడి చోటు చేసుకోగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పల్సర్ సునీ, మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దిలీప్‌ను జూలైలో అరెస్ట్ చేశారు. సుమారు 3 నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన ఈ స్టార్ హీరో అక్టోబర్ 3న ఎట్టకేలకు బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు. -
హీరో దిలీప్‌కు మళ్లీ బెయిల్ నిరాకరణ
కొచ్చి: మలయాళ హీరో దిలీప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. గతంలోనూ బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 25 వరకూ కొనసాగనుంది. -
దిలీప్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
కొచ్చి: మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణను కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు. బెంచ్ ముందుకు కేసు విచారణకు వచ్చినపుడు కేసు అధ్యయనానికి సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దిలీప్‌ను గత సోమవారం అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దిలీప్‌కు దగ్గరి మిత్రుడైన అలువా నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన అన్వర్ సాదత్, సీపీఐ(ఎం)కు చెందిన ఎమ్మెల్యే ముఖేష్లను పోలీసులు సోమవారం విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లు సాదత్ తెలిపారు. ప్రథమ ముద్దాయి పల్సర్ సుని ఏడాది క్రితం వరకు ముఖేష్‌కు డ్రైవర్‌గా పనిచేయగా తర్వాత తొలగించారు. సుని గురించి తనను పోలీసులు ప్రశ్నించారని ముఖేష్ తెలిపారు. మరోవైపు బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహాన్ మృతి కేసులో నిందితుడుగా ఉన్న బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అలిపోరె సెషన్స్ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. -
దిలీప్‌కు బెయిల్ నిరాకరణ
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్‌నకు కిందిస్థాయి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నేటితో పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఫిబ్రవరిలో మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ను ఈ వారం ప్రారంభంలో అరెస్టు చేసి తొలుత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం మాత్రం ఆయనను పోలీసుల విచారణకోసం కస్టడీకి అనుమతించింది. దీంతో ఆయనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. అయితే, పోలీసుల కస్టడీ కూడా ముగియడంతో కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వరకు జైలుకు తరలించింది. దీంతో దిలీప్ బెయిల్‌కోసం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.