
హీరో దిలీప్‌కు మళ్లీ బెయిల్ నిరాకరణ
కొచ్చి: మలయాళ హీరో దిలీప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. గతంలోనూ బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 25 వరకూ కొనసాగనుంది.