కొచ్చి: మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణను కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు. బెంచ్ ముందుకు కేసు విచారణకు వచ్చినపుడు కేసు అధ్యయనానికి సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దిలీప్‌ను గత సోమవారం అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
దిలీప్‌కు దగ్గరి మిత్రుడైన అలువా నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన అన్వర్ సాదత్, సీపీఐ(ఎం)కు చెందిన ఎమ్మెల్యే ముఖేష్‌లను పోలీసులు సోమవారం విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లు సాదత్ తెలిపారు. ప్రథమ ముద్దాయి పల్సర్ సుని ఏడాది క్రితం వరకు ముఖేష్‌కు డ్రైవర్‌గా పనిచేయగా తర్వాత తొలగించారు. సుని గురించి తనను పోలీసులు ప్రశ్నించారని ముఖేష్ తెలిపారు.
మరోవైపు బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహాన్ మృతి కేసులో నిందితుడుగా ఉన్న బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అలిపోరె సెషన్స్ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.