దిలీప్‌కు బెయిల్‌ నిరాకరణ | Actor Dileep Denied Bail By Court In Kerala Actress Assault Case | Sakshi
Sakshi News home page

దిలీప్‌కు కోర్టులో చుక్కెదురు

Published Sat, Jul 15 2017 5:37 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

దిలీప్‌కు బెయిల్‌ నిరాకరణ - Sakshi

దిలీప్‌కు బెయిల్‌ నిరాకరణ

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్‌నకు కిందిస్థాయి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నేటితో పోలీసుల కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

ఫిబ్రవరిలో మలయాళ నటిని కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దిలీప్‌ను ఈ వారం ప్రారంభంలో అరెస్టు చేసి తొలుత 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం మాత్రం ఆయనను పోలీసుల విచారణకోసం కస్టడీకి అనుమతించింది. దీంతో ఆయనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. అయితే, పోలీసుల కస్టడీ కూడా ముగియడంతో కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వరకు జైలుకు తరలించింది. దీంతో దిలీప్‌ బెయిల్‌కోసం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement