vikram chatterjee
-
దిలీప్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
కొచ్చి: మళయాల నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హీరో దిలీప్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణను కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు. బెంచ్ ముందుకు కేసు విచారణకు వచ్చినపుడు కేసు అధ్యయనానికి సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దిలీప్‌ను గత సోమవారం అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దిలీప్‌కు దగ్గరి మిత్రుడైన అలువా నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన అన్వర్ సాదత్, సీపీఐ(ఎం)కు చెందిన ఎమ్మెల్యే ముఖేష్లను పోలీసులు సోమవారం విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్లు సాదత్ తెలిపారు. ప్రథమ ముద్దాయి పల్సర్ సుని ఏడాది క్రితం వరకు ముఖేష్‌కు డ్రైవర్‌గా పనిచేయగా తర్వాత తొలగించారు. సుని గురించి తనను పోలీసులు ప్రశ్నించారని ముఖేష్ తెలిపారు. మరోవైపు బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహాన్ మృతి కేసులో నిందితుడుగా ఉన్న బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అలిపోరె సెషన్స్ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. -
నటి మృతి కేసులో యువ హీరో అరెస్ట్
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు విక్రమ్ చటర్జీని పోలీసులు శుక్రవారం ఉదయం కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. బెంగాలీ మోడల్, యాంకర్ సోనికా సింగ్ చౌహన్ మృతి కేసుకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతి వేగంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడిపి సోనికా సింగ్ మృతికి విక్రమ్ చటర్జీ కారణం అంటూ అతడిపై పోలీసులు 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిపై నమోదు అయిన అభియోగాలు నిరూపణ అయితే కనీసం రెండేళ్ల నుంచి 10ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న సోనికా సింగ్ చౌహాన్, విక్రమ్ చటర్జీ... ఓ పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకు వెళ్లి, అనంతరం పల్టీలు కొడుతూ వెళ్లి రోడ్డు పక్కనే వున్న ఓ దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్ గాయపడ్డాడు. ఆ సమయంలో విక్రమ్ వాహనాన్ని నడుపుతున్నాడు. మద్యం సేవించి అతడు డ్రైవింగ్ చేసినట్టు తమ దర్యాప్తులో తేలడంతో అతడిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను తాగి కారు నడపలేదని విక్రమ్ తొలుత చెప్పినప్పటికీ.. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ద ఈ కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పార్టీలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ మద్యం సేవిస్తూ తమ మిత్రులకు షేర్ చేసిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ప్రమాద సమయంలో కారు అతివేగంగా నడిపినట్లు నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసు నుంచి విక్రమ్ చటర్జీని తప్పించేందుకు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
బెయిల్ కోసం కోర్టు తలుపు తట్టిన హీరో
కోల్‌కతా: యువ హీరో విక్రమ్ ఛటర్జీ ముందస్తు బెయిల్ కోసం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు విక్రమ్ తరపు న్యాయవాది సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మోడల్, నటి టీవీ హోస్ట్ సోనికా చౌహాన్ మృతి కేసులో విక్రమ్ హత్యారోపణలు ఎదుర్కొంటున్నాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఆమె మరణానికి కారకుడయ్యాడని అతడిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఏప్రిల్ 29న కోల్‌కతాలో బెంగాలీ హీరో విక్రమ్- సోనికా ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. తలకు గాయాలైన విక్రమ్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మద్యం సేవించి అతడు డ్రైవింగ్ చేసినట్టు తమ దర్యాప్తులో తేలడంతో అతడిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో విక్రమ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తట్టాడు. -
మోడల్ మృతి; హీరో విక్రమ్‌పై తీవ్ర అభియోగం
కోల్‌కతా: యువ హీరో విక్రమ్ ఛటర్జీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. మోడల్, నటి సోనికా చౌహాన్ మృతి కేసులో పోలీసులు ఆయనపై తీవ్ర అభియోగాలు మోపారు. అవి నిరూపణఅయితే విక్రమ్‌కు కనీసం 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో విక్రమ్‌పై తొలుత ర్యాష్ డ్రైవింగ్ అభియోగం మాత్రమే ఉండేది. కానీ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూడటంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 304(శిక్షార్హ నరహత్య) అభియోగం నమోదయింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులు మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఏప్రిల్ 29న కోల్‌కతాలో బెంగాలీ హీరో విక్రమ్- నటి, టీవీ హోస్ట్, మోడల్ సోనికాలు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. తలకు గాయాలైన విక్రమ్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద సమయంలో కారులో మద్యం ఉన్నా తాను తాగలేదని విక్రమ్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. కానీ పబ్‌లోనే అతను మద్యం సేవించినట్లు ద్యాప్తులో తేలింది. కారును వేగంగా నడిపిన విక్రమ్.. ఉద్దేశపూర్వకంగా సోనికాను హత్యచేయనప్పటికీ, ఆమె మరణానికి కారకుడని తేలింది. దీంతో పోలీసులు అతనిపై ఐసీసీ సెక్షన్ 304 అభియోగాన్ని నమోదుచేశారు.