ఓనం నాడు ఆ నటుడు జైల్లోనే! | Kerala HC rejects Dileep's bail plea again | Sakshi
Sakshi News home page

ఓనం నాడు ఆ నటుడు జైల్లోనే!

Published Tue, Aug 29 2017 12:03 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

ఓనం నాడు ఆ నటుడు జైల్లోనే! - Sakshi

ఓనం నాడు ఆ నటుడు జైల్లోనే!

దిలీప్‌కు మరోసారి బెయిల్‌ నిరాకరించిన హైకోర్టు
 
కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు మంగళవారం కేరళ హైకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్‌ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించడం ఇది రెండోసారి. దీంతో కేరళలో ప్రముఖ ఓనం పండుగ నాడు దిలీప్‌ జైల్లో గడుపాల్సిన పరిస్థితి నెలకొంది.

నటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు బలంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, చార్జ్‌షిట్‌ కూడా సిద్ధమవుతోందని, ఈ దశలో దిలీప్‌కు బెయిల్‌ ఇస్తే.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

గత ఫిబ్రవరి 17న మలయాళ నటిని కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన దిలీప్‌ జూలై 24న బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసులో కీలక మొబైల్‌ఫోన్‌ లభ్యం కాకపోవడంతో హైకోర్టు అప్పట్లో బెయిల్‌ నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement