
శాన్వీ
‘లవ్లీ, అడ్డా, రౌడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు శాన్వీ. ఆ తర్వాత కన్నడ సినిమాలతో బిజీ అయ్యారామె. తాజాగా కన్నడంలో ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు దినేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న 50వ చిత్రం ‘కస్తూరి మహల్’లో లీడ్ రోల్ చేయనున్నారు శాన్వీ. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఇంతకీ కస్తూరి మహల్ కథేంటి? అందులో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అక్టోబర్ మొదటివారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలన్నది చిత్రబృందం ప్లాన్ అని టాక్.
Comments
Please login to add a commentAdd a comment