రోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు అందన్‌కుమార్ మృతి | Andankumar actor killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు అందన్‌కుమార్ మృతి

Published Sun, Mar 30 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు అందన్‌కుమార్ మృతి

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు అందన్‌కుమార్ మృతి

శ్రీశైలంప్రాజెక్టు (కర్నూలు), న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సు అతివేగమే కన్నడ సినీనటుడి ప్రాణం తీసింది. శనివారం శ్రీశైలం -దోర్నాల ఘాట్‌లోని చింత సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లవ్ జంక్షన్ కన్నడ సినిమా కథానాయకుడు అందన్‌కుమార్ అలియాస్ అందనప్పా (34) ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దర్శనార్థమై కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వచ్చారు. శనివారం స్వగ్రామమైన కర్ణాటక రాష్ట్రం సింధనూర్‌కు వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ క్రమంలో శ్రీశైలం -దోర్నాల ఘాట్‌లోని చింత సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అందన్ తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇతను హీరోగా నటించిన లవ్‌జంక్షన్ సినిమా ఇటీవలే విడుదలైంది. మరో చిత్రం షూటింగ్ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement