నటుడు రఘువీర్ గుండెపోటుతో మృతి | Kannada actor Raghuveer passes away | Sakshi
Sakshi News home page

నటుడు రఘువీర్ గుండెపోటుతో మృతి

May 10 2014 8:12 AM | Updated on Sep 2 2017 7:11 AM

నటుడు రఘువీర్ గుండెపోటుతో మృతి

నటుడు రఘువీర్ గుండెపోటుతో మృతి

కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్ (46) మృతి చెందారు.

బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్ (46) మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్వుడ్కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. 'శృంగార కావ్య' సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు.

వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలాకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆయనకు నిరాశనే మిగిల్చాయి. గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయనను బీటీఎం లేఅవుట్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement