ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే విలక్షణమైన పాత్రలే గుర్తొస్తాయి. హీరో, విలన్, తండ్రి, బాబాయ్.. ఇలా అన్ని రకాలు పాత్రలు చేశాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించాడు. అయితే గతంతో పోలిస్తే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అలరించాడు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
కన్నడలో తీసిన 'ఫొటో' అనే సినిమాని కొత్త దర్శకుడు ఉత్సవ్ గోన్వర్ తీశాడు. గతేడాది దిల్లీలో జరిగిన హ్యాబిటట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ రెండు చోట్ల కూడా 'ఫొటో' చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. అయితే ఈ సినిమా చూసిన ప్రకాశ్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 15న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
'ఫొటో' సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఓ వ్యక్తి, వలస కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధిస్తుంది. దీంతో తమ సొంతూరు అయిన రాయచూర్‌కి నడక మార్గంలోనే వెళ్తారు. అసలు ఇంటికి వెళ్లారా అనేది పాయింట్. అలానే ఇదే కథలో ఆ పిల్లాడికి బెంగళూరులోని విధానసౌధ(కర్ణాటక శాసనసభ) ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి లాక్‌డౌన్ కష్టాల మధ్య దాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే 'ఫొటో' సినిమా స్టోరీ.
కథ పరంగా బాగానే ఉంది. వలస కూలీల కష్టాలు ప్రతిబింబించేలా ఉంది. పలు అవార్డ్ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సినిమా నచ్చి.. సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ని జనాలు చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్)
Comments
Please login to add a commentAdd a comment