Soundharya Rajinikanth
-
జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్
రజనీకాంత్ 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఒకరకంగా జైలర్ విజయం కోలీవుడ్ పరిశ్రమకు మంచి బూస్ట్‌ను తెచ్చిందనే చెప్పవచ్చు. అక్కడ రజనీకాంత్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సక్సెస్ నిరూపించింది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమా గురించి తాజాగ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రజనీ నిజ జీవితంలో జైలర్ క్లైమాక్స్ సీన్ జైలర్ సినిమాలో తన కుటుంబ సన్నివేశాల్లో వచ్చే చాలా డైలాగులు రజనీ నిజ జీవితానికి సంబంధించినవని ఆయన అన్నారు. క్లైమాక్స్ సీన్లో ఏదైనా చెప్పాలని ఉందా..? అంటూ తన కుమారుడిని పదేపదే రజనీ అడిగే సన్నివేశం ఉంటుంది. అందులో అతని నిజ జీవితంలోని నొప్పిని చూపిస్తుంది. ఇది కేవలం డైలాగ్ కాదు. అది వారి జీవితం. డైలాగ్ మాట్లాడేటప్పుడు అతను ధనుష్, అతని కుమార్తె ఐశ్వర్య గురించి ఆలోచించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. ధనుష్ దంపతుల మధ్య ఏదో జరుగుతోందని రజనీకి ముందే అనిపించివుండవచ్చు.. విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విషయం గురించి తన కూతురిని రజనీ నేరుగా అడగలేరు. అందుకే ఆయన నిజ జీవితంలో కూడా 'ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అని ఆమెను చాలాసార్లు అడిగారు.' అని ప్రవీణ్ గాంధీ తెలిపాడు. ఆ సినిమాలో రజనీ నవ్వుతున్న టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది. అందులో చాలా ఎమోషన్ కనిపిస్తుంది. ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు ఆ సీన్ చాలా దగ్గరగా ఉంటుందని ఆయన తెలిపాడు. (ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రీలీల.. కారణం ఇదేనా?) ఆ సమయంలో చాలాసార్లు కన్నీళ్లు పెట్టాడు రజనీకాంత్‌కు ఇద్దరు కూతుళ్లు. ఒక తండ్రిగా, అతను తన కుమార్తెలను చాలా అమితంగా ప్రేమిస్తాడు. వారిని ఆయన చాలా క్రమశిక్షణతోనే పెంచారు. కానీ దేవుడి రాతను ఎవరూ మార్చలేరని ఆయన చెప్పారు. రజనీకి తన ఇద్దరు కూతుళ్ల ప్రాణాలే ముఖ్యం. కానీ వారి జీవితంలో జరిగిన సంఘటనలకు ఇద్దరూ బాధపడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఆ షాట్‌లోనే కనిపిస్తాయని ప్రవీణ్ గాంధీ స్పష్టం చేశారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య గతేడాది ధనుష్ నుంచి విడిపోయింది. వారి పిల్లల యాత్ర, లింగ ఇద్దరూ ధనుష్ వద్దే ఉంటారు. అప్పడప్పుడు రజనీకాంత్ వద్దకు వెళ్తుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ పిల్లలిద్దరినీ చూడగానే చాలా సందర్భాల్లో రజనీ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా వారి విడాకులు ఇరువురి కుటుంబాలను తీవ్రంగా కలవరపరిచాయని చెప్పుకొచ్చాడు. గతంలో రజనీకాంత్ కూడా వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించారని తెలిసింది అది ఫలించలేదన్నాడు. సౌందర్య జీవితంలో కూడా ఇబ్బందులే రజనీ చిన్న కూతురు సౌందర్య కూడా మొదటి వివాహం విఫలమైంది. గ్రాఫిక్ డిజైనర్‌గా ఉన్న సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. 2015లో వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత విబేదాలు రావడంతో 2017లో ఇద్దరూ విడిపోయారు. 2019లో నటుడు, వ్యాపారవేత్త విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకుంది. గతేడాది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడని ఆయన పేర్కొన్నాడు. జైలర్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే చాలా సన్నివేశాలు రజనీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని ప్రవీణ్ గాంధీ తెలుపుతూ ఆ ఇంటర్వ్యూను ముగించారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) -
మళ్లీ వార్తల్లోకి వచ్చిన రజనీకాంత్ రెండవ కూతురు
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఆరేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ వారసురాళ్లు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు దర్శకులుగా కొనసాగుతున్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా లాల్ సలాం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఇంతకుముందు తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పలు చిత్రాలకు ఈమె గ్రాఫిక్స్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన వేలైయిల్లా పట్టాదారి చిత్రానికి ఈమెనే దర్శకురాలు. కాగా ఆరేళ్ల తరువాత సౌందర్య రజనీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈసారి ఆమెజాన్ ప్రైమ్ టైం కోసం రూపొందించబోతున్నారని, ఇందులో నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) -
రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్టు మాయం
సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్ రెండవ కూతురు, దర్శకురాలు సౌందర్య, ఆమె భర్త విశాకన్ పాస్‌పోర్టు మాయమైంది. విశాకన్, సౌందర్యరజనీకాంత్ మూడు రోజుల కిందట ఎమరాల్డ్స్ విమానంలో చెన్నై నుంచి లండన్‌కు వెళ్లారు. లండన్‌లో విమానం దిగగానే సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్టు చూపించడానికి దాన్ని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా కనిపించలేదు. సూట్‌కేస్‌లో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లకు చెందిన పాస్‌పోర్టులు, సహా రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయట. దీంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్ విమానాశ్రయంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ అధికారులకు తమ పాస్‌పోర్టులను చూపకపోవడంతో ఆ అధికారులు వారిని విమానాశ్రయ విశ్రాంతి గదికి పంపారు. ఈ విషయం అక్కడి భారతీయ రాయబారులకు, నటుడు రజనీకాంత్‌కు తెలియజేశారు. తాత్కాలిక పాస్‌పోర్టులను ఏర్పాటు చేయయడంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లను లండన్ విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు పంపివేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
కొచ్చాడయాన్ ఎందుకు ఆడలేదంటే..
తమిళసినిమా: కోలీవుడ్‌లో తండ్రి బాటలో పయనిస్తున్న అతి కొద్ది మంది తనయురాళ్లలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతుర్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ ఒకరు. వీరిద్దరూ తండ్రి చాటు పిల్లలుగా కాకుండా తమ కంటూ ప్రత్యేక గు ర్తింపును పొందుతూ స్వతంత్రంగా సినీరంగంలో ఎదుగుతున్నారు. రజనీకాంత్ పెద్ద కూతురు తన భర్త ధనుష్ కథానాయకుడుగా 3 చిత్రం చేసి ప్రాచుర్యం పొందారు. ఆ చి త్రంలోని వై దిస్ కొలై వెరి డీ పాట ప్రపంచ సినీ ప్రేక్షకులనే మైమరపించింది.ఇక రెండవ కూతురు సౌందర్య ఏకంగా తన తండ్రినే కథానాయకుడిగా ఎంచుకుని కొచ్చాడయాన్ అనే క్యాప్చరింగ్ మోషన్ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ మహిళా దర్శకురాలు తన బావ ధనుష్ కథా నాయకుడిగా వీఐపీ–2 చిత్రాన్ని తె రకెక్కించారు. నటుడు ధనుష్ కథ, మాటలు అందించడంతో పాటు వి.క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్.థానుతో కలిసి నిర్మిస్తుండడం విశేషం. ఇందులో బాలీవుడ్ క్రేజీ నటి కాజోల్ ముఖ్య భూమికను పోషించడం మరో విశేషం. అమలాపాల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి షాన్‌రోల్డన్ సంగీత బాణీలను అందించారు. తమిళంతో పా టు,తెలుగు,హిందీభాషల్లోనూ తెరకెక్కిన వీఐపీ–2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 28న మూడు భాషల్లోనూ ఏక కా లంలో విడుదలకు ముస్తాబవుతోం ది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర దర్శకురాలు విలేకరులతో ముచ్చటించారు. ప్ర: వీఐపీ 2 చిత్రం గురించి? జ: వీఐపీ 2 చిత్రం చేయడం మంచి అనుభవం. ఇందులోని నటీనటులు, సాంకేతిక వర్గం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్ర: ఇందులో ప్రధాన పాత్రకు బాలీవుడ్ నటి కాజోల్నే ఎంచుకోవడానికి కారణం? జ: ధనుష్ ఈ కథను తయారు చేసినప్పుడే ఇందులోని వసుంధర పాత్రకు కాజోల్ అయితే బాగుం టుందని భావించాం. తమ అభిప్రాయాన్ని నిర్మాత కలైపులి.ఎస్ థానుకు చెప్పగా ఆయన చాలా పాజిటీవ్‌గా స్పందించారు. ఆ తరువాత ఒక రోజు ధనుష్ ఫోన్ చేసి కాజోల్ ఓకే అన్నారు అని చెప్పారు. దీంతో వీఐపీ–2 చిత్రానికి మరింత హైప్ వచ్చేసింది ప్ర: కాజోల్ చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం గురించి? జ: నిజం చెప్పాలంటే కాజోల్‌ది ప్రతినాయకి పాత్ర కాదు. చిత్రంలో రఘువరన్ పాత్రకు వసుంధర పాత్రకు మధ్య క్లాష్ నడుస్తుంది. ఆ మె స్టైలిష్ నటన చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. ప్ర: పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర తరహాలో ఉంటుందా ఇందులో కాజోల్ పాత్ర? జ: ఆ పాత్రకు పోల్చడం సరి కాదు. అయితే కాజోల్ పాత్ర వేరే విధంగా ఉంటుంది. తను చాలా కాన్ఫిడెంట్‌గా నటించారు. సాధారణంగా తెలియని భాషలో నటించడం చాలా కష్టం. అయితే తాను ఆంగ్లంలో చెప్పిన సంభాషణలను కాజోల్ చక్కగా అవగాహన చేసుకుని నటించారు. ప్ర: వీఐపీ 2 చిత్రాన్ని రజనీకాంత్ చూశారా? జ: ఇంకా చూడలేదు. చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్ర: మీ తండ్రి రజనీకాంత్ కథానాయకుడిగా మళ్లీ చిత్రం చేస్తారా? జ: అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను ప్ర: కొచ్చాడయాన్ చిత్రం ప్రేక్షకాదరణ పొందకపోవడానికి కారణం ఏమిటంటారు? జ: అప్పట్లో యానిమేషన్ గురించి ప్రేక్షకులకు సరిగా అర్థం కాకపోవడమే. నాన్నను అభిమానులు లైవ్‌గా చూడాలని కోరుకుంటారు. యానిమేషన్ చిత్రం కావడంతో వారికి అర్థం కాలేదు. అయితే ఆ చిత్ర ప్రత్యేకత దానిదే. ప్ర: మీ తండ్రి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న కోరికను నటుడు కమలహాసన్ కూతురు శ్రుతీహాసన్ వ్యక్తం చేశారు. అదే విధంగా కమలహాసన్ మీ తండ్రి రాజకీయ రంగప్రవేశం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని గురించి మీ అభిప్రాయం? జ: కమల్ అంకుల్ అభిప్రాయాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అవి అర్థవంతంగా ఉంటాయి కూడా. నాన్న, కమల్ అంకుల్ చిరకాల మిత్రులు. వారిద్దరూ బాగుండాలి. ప్ర: మీ సోదరి ఐశ్వర్య, మీరు ఇద్దరూ దర్శకత్వంపైనే దృష్టి పెట్టారు. నటనపై మొగ్గు చూపకపోవడానికి కారణం? జ: ఎమో అలాంటి ఆలోచన రాలే దు. నేను మొదట గ్రాఫిక్స్, యాని మేషన్ నేర్చుకున్నాను. ఆ తరువా త దర్శకత్వంపై దృష్టిసారించాను. ప్ర: ఇప్పడు నటించే అవకాశం ఉందా? జ: అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా. ఎలాంటి పాత్రఅన్నది వచ్చే అవకాశాలను బట్టి ఉంటుంది. ప్ర: కొత్త తరహాలో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారా? జ: హారీపోటర్ చిత్రం తరహాలో దక్షిణా చిత్రాలు రాలేదు. బాలల ఇతివృత్తంతో అలాంటి చిత్రం చేయాలనుంది. కచ్చితంగా చేస్తాను. ప్ర: అందులో మీ అబ్బాయి వేద్ నటించే అవకాశం ఉందా? జ: తప్పకుండా ఉంది ప్ర: తెలుగులో దర్శకత్వం వహిస్తారా? జ: అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. -
20 ఏళ్ల తరువాత మరోసారి సౌత్‌లో..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భామ కాజోల్. ఒకప్పుడు సినీ అభిమానుల కలల రారాణిగా ఉన్న ఈ భామ.. దక్షిణాదిలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. 'ఓ వాన పడితే ఆ కొండ కోన హాయే' అంటూ మెరుపు కలలు సినిమాలో ఆడిపాడిన కాజోల్ తరువాత ఒక్క సౌత్ సినిమాకు కూడా అంగీకరించలేదు. డబ్బింగ్ వర్షన్‌గా రిలీజ్ అయిన దిల్వాలే దుల్హానియా లేజాయింగే సినిమా కూడా కాజోల్కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మెరుపు కలలు సినిమా రిలీజ్ అయిన ఇరవైయ్యేల తరువాత ఇప్పుడు మరోసారి దక్షిణాది వెండితెర మీద మెరిసేందుకు అంగీకరించింది కాజోల్. ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీఐపీ 2 సినిమాలో కాజోల్ ఓ కీలక పాత్రలో నటించనుందట. ఇప్పటికే కథ విన్న కాజోల్ ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పింది. ధనుష్ సరసన అమలాపాల్, మంజిమా మోహన్లతో పాటు మరో భామ హీరోయిన్గా నటిస్తుండగా కాజోల్ ప్రత్యేక పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతోంది.