20 ఏళ్ల తరువాత మరోసారి సౌత్లో..! | Bollywood Beauty Kajol in Dhanush Vip 2 | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తరువాత మరోసారి సౌత్లో..!

Published Fri, Dec 2 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

20 ఏళ్ల తరువాత మరోసారి సౌత్లో..!

20 ఏళ్ల తరువాత మరోసారి సౌత్లో..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భామ కాజోల్. ఒకప్పుడు సినీ అభిమానుల కలల రారాణిగా ఉన్న ఈ భామ.. దక్షిణాదిలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. 'ఓ వాన పడితే ఆ కొండ కోన హాయే' అంటూ మెరుపు కలలు సినిమాలో ఆడిపాడిన కాజోల్ తరువాత ఒక్క సౌత్ సినిమాకు కూడా అంగీకరించలేదు. డబ్బింగ్ వర్షన్గా రిలీజ్ అయిన దిల్వాలే దుల్హానియా లేజాయింగే సినిమా కూడా కాజోల్కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

మెరుపు కలలు సినిమా రిలీజ్ అయిన ఇరవైయ్యేల తరువాత ఇప్పుడు మరోసారి దక్షిణాది వెండితెర మీద మెరిసేందుకు అంగీకరించింది కాజోల్. ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీఐపీ 2 సినిమాలో కాజోల్ ఓ కీలక పాత్రలో నటించనుందట. ఇప్పటికే కథ విన్న కాజోల్ ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పింది. ధనుష్ సరసన అమలాపాల్, మంజిమా మోహన్లతో పాటు మరో భామ హీరోయిన్గా నటిస్తుండగా కాజోల్ ప్రత్యేక పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement