జూన్ 7న 'విఐపి 2' టీజర్ | Dhanush VIP 2 teaser | Sakshi
Sakshi News home page

జూన్ 7న 'విఐపి 2' టీజర్

Published Mon, Jun 5 2017 4:05 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

జూన్ 7న 'విఐపి 2' టీజర్

జూన్ 7న 'విఐపి 2' టీజర్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విఐపి 2. 2014లో ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు సీక్వల్ గా ఈ సినిమానూ రూపొందిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు ధనుష్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 7న రిలీజ్ చేస్తున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ట్రైలర్ ను రూపొందిస్తున్నారు.

తొలి భాగం టీజర్ కారణంగానే అంతటి ఘనవిజయం సాధించిందన్న నమ్మకంతో ఈ సారి కూడా టీజర్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి ధనుష్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement