
సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్ రెండవ కూతురు, దర్శకురాలు సౌందర్య, ఆమె భర్త విశాకన్ పాస్‌పోర్టు మాయమైంది. విశాకన్, సౌందర్యరజనీకాంత్ మూడు రోజుల కిందట ఎమరాల్డ్స్ విమానంలో చెన్నై నుంచి లండన్‌కు వెళ్లారు. లండన్‌లో విమానం దిగగానే సెక్యూరిటీ అధికారులకు పాస్‌పోర్టు చూపించడానికి దాన్ని భద్రపరిచిన సూట్‌కేస్ కోసం వెతకగా కనిపించలేదు. సూట్‌కేస్‌లో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లకు చెందిన పాస్‌పోర్టులు, సహా రూ.లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయట. దీంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్ విమానాశ్రయంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెక్యూరిటీ అధికారులకు తమ పాస్‌పోర్టులను చూపకపోవడంతో ఆ అధికారులు వారిని విమానాశ్రయ విశ్రాంతి గదికి పంపారు. ఈ విషయం అక్కడి భారతీయ రాయబారులకు, నటుడు రజనీకాంత్‌కు తెలియజేశారు. తాత్కాలిక పాస్‌పోర్టులను ఏర్పాటు చేయయడంతో అశోకన్, సౌందర్యరజనీకాంత్‌లను లండన్ విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు పంపివేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment