ధనుష్‌ సినిమాలో ఆ హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్‌.. | Priyanka Arul Mohan Special Song In Dhanush Nilavukku Enmel Ennadi Kobam | Sakshi
Sakshi News home page

మొన్నే ధనుష్‌ సరసన హీరోయిన్‌గా.. ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌!

Published Fri, Mar 15 2024 10:16 AM | Last Updated on Fri, Mar 15 2024 11:10 AM

Priyanka Arul Mohan Special Song In Dhanush Nilavukku Enmel Ennadi Kobam - Sakshi

హీరోగా బిజీగా ఉన్న ధనుష్‌ దర్శకుడిగా, నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రాయన్‌. ఇది ధనుష్‌ 50వ చిత్రం అన్నది తెలిసిందే. దుషారా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న రాయన్‌ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోది. దీంతో ధనుష్‌ ప్రస్తుతం తన 51వ చిత్రం కుబేరపై దృష్టి పెట్టారు.

కుబేర..
టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇకపోతే ధనుష్‌ మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సోదరి కొడుకు పవిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటి అనికా సురేంద్రన్‌, మాథ్యూ థామస్‌, ప్రియ ప్రకాశ్‌ వారియర్‌, రమ్య రంగనాథన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో ధనుష్‌ కీలక పాత్రలో మెరవనున్నారు. దీనికి జీవి ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

స్పెషల్‌ సాంగ్‌
ఈ చిత్రాన్ని వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై ధనుష్‌ పేరెంట్స్‌.. దర్శకుడు కస్తూరి రాజా, విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిలావుకు ఎన్‌మేల్‌ ఎన్నడీ కోబం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఆ పాటలో ప్రియాంక మోహన్‌ నటించినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ధనుష్‌తో కలిసి ఈ బ్యూటీ కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న నిలావుకు ఎన్‌ మేల్‌ ఎన్నడీ కోబం చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పాట చిత్రంలో చాలా కీలకమని తెలిసింది.

చదవండి: మూడు నెలల తర్వాత చెప్పింది చేసిన 'బిగ్‌బాస్ 7' విన్నర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement