సినిమా హీరోయిన్ల విషయంలో ప్రతిభ కంటే అదృష్టం బాగా పని చేస్తుంది. సక్సెస్ వెంటేనే అవకాశాలు వరిస్తాయి. ఇవన్నీ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌కు కరెక్ట్‌గా వర్తిస్తాయి. అమ్మడి అందం ఓకే అయినా, ఒడ్డు పొడుగులో మార్కులు తక్కువే పడతాయి. అయితే లక్ మాత్రం అందుకోనంత వేగంగా పరుగెడుతోందని చెప్పవచ్చు. ఇటీవల అందాలారబోత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది.
(చదవండి: కోలీవుడ్‌లో సంచలనం.. డైరెక్టర్ లింగుస్వామికి జైలు శిక్ష)
తెలుగులో నానితో గ్యాంగ్ లీడర్ చిత్రం తరువాత ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ శివకార్తీకేయన్‌తో జత కట్టిన తొలి చిత్రం డాక్టర్, రెండో చిత్రం డాన్ వరుసగా విజయాలు సాధించడంతో అమ్మడు లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. మధ్యలో సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ చిత్రంలోనూ నటించింది. అలా చాలా తక్కువ సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటోంది.
ప్రస్తుతం ఏకంగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. అదే విధంగా నటుడు జయం రవితో రొమాన్స్ చేస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్నారు. ఇది ఆయన 30వ చిత్రం. ఇందులో ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యి తొలి సెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ చెన్నైలో మొదలు కానుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇతి ఇతివృత్తంతో కూడిన ఇందులో నటుడు నట్టి, వీటీవీ గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment