ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్‌ | Priyanka Mohan Small Injured At Shopping Mall Opening Event | Sakshi
Sakshi News home page

ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్‌

Published Thu, Oct 3 2024 4:55 PM | Last Updated on Thu, Oct 3 2024 5:06 PM

Priyanka Mohan Small Injured At Shopping Mall Opening Event

న‌టి ప్రియాంక మోహ‌న్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణ‌లోని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఒక షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది. ఈ కార్యక్రమంలో అప‌శృతి చోటు చేసుకోగా తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

రీసెంట్‌గా స‌రిపోదా శ‌నివారం చిత్రంతో ప్రియాంక మోహన్‌కు మరింత పాపులారిటీ పెరిగింది. అయితే,  తొర్రూరులో రీసెంట్‌గా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు ఆమె వెల్లింది. అయితే, ఆమె స్టేజీ మీదకు చేరుకోగానే చాలామంది ఒక్కసారిగా అక్కడకు చేరిపోయారు. దీంతో ఒక్కసారిగా స్టేజి  కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదం నుంచి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడింది.

ఇదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న  పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హానుమండ్ల ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆమెను స‌మీపంలోని  ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తుంది. గాయపడిన ఝాన్సి రెడ్డి.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యశస్వినికి అత్త అవుతారనే విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి ప్రియాంకా మోహన్‌ స్పందించింది. తాను స్వల్ప గాయాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ఘటనలో గాయిపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ‍ప్రార్థిస్తున్నాను.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement