
ఇండస్ట్రీలోకి వస్తున్న వారసులు మినహా చాలామంది నటీనటులు సొంతంగా ఎదిగినవాళ్లే. హీరోయిన్లలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా మొదట్లో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. కానీ చాలా కష్టాలు పడిన తర్వాత అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజులో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇక దక్షిణాదిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ దీనికి ఏ మాత్రం అతీతం కాదు.
(ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?)
తొలుత మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక మోహన్.. అడపాదడపా యాడ్స్ చేస్తూ వచ్చింది. అయితే ఈ టైంలో కనీస అవసరాలకు కూడా ఇవి సరిపోకపోవడంతో చాలా కష్టాలు పడింది. అలా మోడల్‌గా చేస్తూనే సినీ రంగంపై ఆసక్తి పెంచుకుంది. నటించడం తెలియకపోవడంతో యాక్టింగ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్'లో హీరోయిన్‌గా చేసింది.
దీనితో పాటు శర్వానంద్ 'శ్రీకారం'లోనూ నటించింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అదే టైంలో తమిళ డైరెక్టర్ నెల్సన్ దృష్టిలో పడింది. అతడు తీసిన 'డాక్టర్' మూవీలో చేసింది. ఇది సూపర్ హిట్ కావడంతో ప్రియాంక దశ తిరిగింది. తమిళంలో డాన్, ఈటీ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, ఓజీ తదితర పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది.
(ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్)
Comments
Please login to add a commentAdd a comment