శివకార్తికేయన్‌ చేసిన పనివల్లే ప్రియాంకా మోహన్ బొద్దుగా అయిందా? | Priyanka Arul Mohan Comments On Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

Priyanka Arul Mohan: శివకార్తికేయన్‌ చేసిన పనివల్లే ప్రియాంకా మోహన్ బొద్దుగా అయిందా?

Published Sun, Oct 29 2023 6:54 AM | Last Updated on Sun, Oct 29 2023 3:08 PM

Priyanka Arul Mohan Comments On Sivakarthikeyan - Sakshi

తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్‌ మోహన్. 2019లో ఒందు కథై హేల అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయమైన నటి ఈమె. ఆ వెంటనే టాలీవుడ్‌లో  నాని 'గ్యాంగ్‌ లీడర్‌' ఛాన్స్‌ కొట్టేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పాగా వేసింది. ఇక్కడ శివకార్తికేయన్‌ సరసన డాక్టర్‌ చిత్రంలో నటించి దాంతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఏకంగా సూర్యతో రొమానన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో ఎదర్కుమ్‌ తుణిందవన్‌ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రియాంక మోహన్‌కు పెద్దగా నష్టం జరగలేదు.

ఆ వెంటనే మరోసారి శివకార్తికేయన్‌తో డాన్‌ చిత్రంలో జతకట్టే అవకాశం వరించింది. లక్కీగా ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. అలా లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ తాజాగా ధనుష్‌ సరసన నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ అమ్మడికి మరోసారి తెలుగులో  పవన్‌ కళ్యాణ్‌ సరసన ఓజీ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా నానితో 'సరిపోదా శనివారం' అనే చిత్రం ద్వారా రెండో సారి జతకట్టనుంది.

ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమెపై కామెంట్లు వస్తుండటంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా నటుడు శివ కార్తికేయన్‌ గురించి మాట్లాడుతూ ఆయనతో తాను రెండు చిత్రాలు చేసినట్లు చెప్పింది. శివ కార్తికేయన్‌కు ఒక ఎడిక్ట్‌ ఉందని, ఆయన స్వీట్స్‌ ఎక్కువగా తింటారని చెప్పింది. షూటింగ్‌ స్పాట్లో కూడా స్వీట్స్‌ తింటూ పక్కనున్న వారికి కూడా ఇస్తారని చెప్పింది.

అలా ఆయన తనను కూడా స్వీట్స్‌ తినమని ఒత్తిడి చేసే వారని చెప్పింది. అలా ఒక హీరో అయ్యుండి కూడా బరువు పెరుగుతాననే భయం కూడా శివకార్తికేయన్‌కు ఉండదని నటి ప్రియాంకా మోహన్‌ పేర్కొంది. అలా పరోక్షంగా తను ఎందుకు బొద్దుగా అయిందో ఇలా చెప్పకనే చెప్పిందా బ్యూటీ.. కాగా దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ట్రెండింగ్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement