అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా: ప్రియాంక మోహన్‌ | Priyanka Mohan Comments On Her Fans, Warns A Fan For Chasing, Deets Inside | Sakshi
Sakshi News home page

Priyanka Mohan: అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా

Published Mon, Sep 30 2024 10:03 AM | Last Updated on Mon, Sep 30 2024 10:56 AM

Priyanka Mohan Comments On Her Fans

సినీ నటీమణుల జీవితం అద్దాల మేడ లాంటిది అంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు కూడబెట్టిన  ప్రముఖ నటీమణులు కూడా అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వీరిని అభిమానించే ఆరాధించే అభిమానులతో కూడా అవస్థలు ఎదురవుతుంటాయి. రీసెంట్‌గా నానితో సరిపోదా శనివారం చిత్రంతో ఈ బ్యూటికి మంచి గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలో ఎదుగుతున్న ప్రియాంక మోహన్‌.. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ భామ మొదట్లో గ్లామరస్‌ పాత్రలోనూ నటించారు. అలా ఆమె వెండి తెరపై అందాలను ఆరబోసిన చిత్రం టిక్‌ టాక్‌. 

ఆమె లక్కు ఏమిటంటే తమిళంలో టిక్‌ టాక్‌ తొలి చిత్రం అయినా, మొదట విడుదలైన చిత్రం శివకార్తికేయన్‌తో జత కట్టిన డాక్టర్‌. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం అలా శివకార్తీకేయన్‌ సరసన డాన్‌ అనే మరో చిత్రంలో నటించి హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత సూర్యకు జంటగా ఎదర్కుమ్‌ తునిందన్ (ఈటీ), ధనుష్‌తో కలిసి కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాలు నటించారు. ఇటీవల తెలుగులో నటించిన సరిపోదా శనివారం చిత్రం కూడా సక్సెస్‌ అయ్యింది. కాగా తాజాగా జయం రవితో జతకట్టిన బ్రదర్‌ చిత్రం దీపావళికి విడుదలకు కానుంది. మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్న ప్రియాంక మోహన్‌ తాజాగా మరోసారి చర్చలోకి ఎక్కారు. 

'బ్రదర్‌' అనే తమిళ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మోహన్‌.. సెల్ఫీ కోసం యత్నించిన ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అక్కడ పెద్ద కలకలానికి దారి తీసింది. ఈ వ్యవహారం గురించి నటి శరణ్యతో ప్రియాంక మోహన్‌ మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఆమె పేర్కొంటూ అతను చాలా రోజులుగా తనను ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చేవాడిని చెప్పారు. బ్రదర్‌ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం రోజున కూడా అతను తన గ్రూప్‌తో స్థానిక వెలచ్చేరిలోని ఫినిక్స్‌ మాల్‌ నుంచి తనను ఫాలో అవుతూ వచ్చేవాడిని చెప్పారు. అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా అంటూ మండిపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement