సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటింస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవలె ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుందంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటినే నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు మేకర్స్.
ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుందంటూ మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ నాని సరసన గ్యాంగ్ లీడర్, శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కల్యాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.
𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF
— DVV Entertainment (@DVVMovies) April 19, 2023
Comments
Please login to add a commentAdd a comment