
హీరోయిన్లు చాలామంది గ్లామర్ లేదా యాక్టింగ్‌ని నమ్ముకుంటారు.

కొందరు విషయాలో మాత్రం ఈ రెండు అంశాలు లేవనే విమర్శలు వస్తుంటాయి.

ఆ హీరోయినే ప్రియాంక మోహన్. ఈమె పుట్టినరోజు నేడు (నవంబర్ 20)

ప్రియాంక మోహన్ పుట్టి పెరిగిదంతా బెంగళూరులోనే. బయలాజికల్ ఇంజినీరింగ్ చేసింది.

2019లో 'ఒందు కథే హెల్లే' అనే కన్నడ సినిమాతో నటిగా మారింది.

అదే ఏడాది నాని 'గ్యాంగ్ లీడర్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. కానీ ప్రియాంక క్యూట్‌నెస్ ప్రేక్షకులకు నచ్చింది.

దీని తర్వాత శర్వానంద్‌తో 'శ్రీకారం' చేసింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు.

శివకార్తికేయన్‌తో 'డాక్టర్', సూర్యతో 'ఈటీ', ధనుష్‌తో 'కెప్టెన్ మిల్లర్' లాంటి తమిళ మూవీస్ చేసింది.

రీసెంట్‌గా నానితో తెలుగులో 'సరిపోదా శనివారం', జయం రవితో తమిళంలో 'బ్రదర్' చిత్రాలు చేసింది.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజీ' మూవీలోనూ ఈమెనే మెయిన్ హీరోయిన్.

అంతా బాగానే ఉంది కానీ ప్రియాంక యాక్టింగ్‌పై మూవీ రిలీజైన ప్రతిసారి విమర్శలు వస్తుంటాయి.

అయితేనేం సూర్య, ధనుష్, నాని లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం చాలామంది హీరోయిన్లతో పోలిస్తే ప్రియాంక మోహన్.. మూవీ ఛాన్స్‌ల విషయంలో నిజంగా లక్కీనే.















