Priyanka Arul Mohan, Nivedhithaa Sathish Confirmed For Dhanush Captain Miller Movie - Sakshi
Sakshi News home page

Catain Miller Movie: ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రంలో ప్రియాంక మోహన్‌, నివేదితా సతీష్‌

Published Wed, Sep 21 2022 9:11 AM | Last Updated on Wed, Sep 21 2022 11:25 AM

Priyanka Arul Mohan And Nivedhithaa Sathish Are Finalised in Captain Miller Movie - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్‌ చెయన్నాడు. ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా ప్రియాంకా అరుళ్‌ మోహన్, నివేదితా సతీష్‌ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

‘‘ధనుష్‌గారు చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ‘‘స్ఫూర్తి నింపే నటుడు ధనుష్‌ గారితో కలిసి నటించేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు నివేదితా సతీష్‌. 1930–1940 నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ ఓ కీ రోల్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. జీవీ ప్రకాశ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement