లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్ | Jailer Director Nelson Dileep Kumar Turns Producer For Priyanka Mohan - Sakshi
Sakshi News home page

నిర్మాతగా 'జైలర్' డైరెక్టర్ నెల్సన్.. అలాంటి కాన్సెప్ట్ మూవీతో

Published Tue, Dec 12 2023 4:24 PM | Last Updated on Tue, Dec 12 2023 4:45 PM

Jailer Director Nelson Dileep Kumar Turns Producer For Priyanka Mohan - Sakshi

దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది మూవీ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్.. ఈ రూట్‌లోకి వచ్చారు. వస్తూనే ఉన్నారు. 'లియో' లోకేష్‌ కనకరాజ్‌ కూడా ఈ మధ్యే 'జీ స్క్వాడ్' పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 'జైలర్‌' ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా నిర్మాత అయిపోయాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్)

'జైలర్‌' తర్వాత నెల్సన్ డైరెక్ట్ చేసే మూవీ ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తన శిష్యుడు శివ బాలన్‌‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీస్తున్నాడు. లేడీ ఓరియంటెడ్‌ కథతో తీస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేస్తోంది. గతంలో నెల్సన్ తీసిన ఫస్ట్ మూవీ 'డాక్టర్'లో ప్రియాంకనే హీరోయిన్. సో తన లక్కీ హీరోయిన్‌తోనే నెల్సన్.. తొలి చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రియాంక సరసన కవిన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్య కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

(ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement