
దళపతి విజయ్ ఇద్దరు భామలతో కలిసి నటించి చాలాకాలం అయ్యింది. అప్పుడెప్పుడో 2007లో అళగియ తమిళ్ మగన్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి శ్రియ, నమితలతో రొమాన్స్ చేశారు. ఆ తర్వాత బిగిల్ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేసినా ఇద్దరు హీరోయిన్లతో నటించలేదు. తాజాగా లియో చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్‌లు విజయ్‌తో జత కట్టారు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా విజయ్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. విశేషం ఏంటంటే ఇందులో విజయ్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంలో నటి జ్యోతిక విజయ్ సరసన నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్‌గా నటించే అవకాశం నటి ప్రియాంక మోహన్‌ను వరించిందని సమాచారం. దీనికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, సిద్ధార్థ చాయాగ్రహణం అందించనున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది విజయ్ నటించే 68వ చిత్రం. దీనికి సంబంధించి పూర్తి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment