Director Sandeep Reddy Vanga Clarity About His Movie With Mahesh Babu - Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబుతో సినిమా: క్లారిటీ ఇచ్చిన సందీప్‌రెడ్డి

Published Wed, Aug 11 2021 8:15 AM | Last Updated on Wed, Aug 11 2021 10:11 AM

Sandeep Reddy Vanga Gave Clarity On a Movie With Mahesh Babu - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సోమవారం సూపర్‌ స్టార్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ వరుసగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే తివిక్రమ్‌-మహేశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అప్‌డేట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’ ఫేం సందీప్‌రెడ్డి వంగ కూడా మహేశ్‌తో తన ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు. సూపర్‌ స్టార్‌తో తన సినిమా తప్పకుండ ఉంటుందని, ఆయనకు స్క్రిప్ట్‌ లైన్‌ వివరించానని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.

తను చెప్పిన లైన్‌ మహేశ్‌కు నచ్చిందని, ప్రస్తుతం కథ చర్చల దశలో ఉందని చెప్పాడు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎలాంటి న్యూస్‌, అప్‌డేట్‌ కాని రాలేదు.దీంతో వీరి కాంబినేషన్‌లో మూవీ లేనట్లేనని వార్తలు వచ్చాయి. అయితే వాటిని సందీప్‌ వంగ కొట్టిపారేస్తూ.. తమ కాంబినేషన్‌ తప్పకుండా సినిమా ఉంటుందని, ఓ ఫ్రెష్‌ సబ్జెక్ట్‌తో సూపర్‌ స్టార్‌ను మీ ముందుకు తీసుకువస్తానని పేర్కొన్నాడు.

‘అర్జున్‌ రెడ్డి’ లాంటి లవ్‌స్టోరీ తీసిన సందీప్‌ సూపర్‌ స్టార్‌తో మూవీ అంటే ఏ రేంజ్‌ ఉండబోతుందో! అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement