![Mahesh Babu And Rajamouli Chief Guests In Animal Movie Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/27/mahesh-babu-rajamouli.jpg.webp?itok=NyFHGXbm)
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా రన్‌టైమ్ 3:21 గంటలు అనే వార్త బయటకు రాగానే అందరూ చూడలేమంటూ కామెంట్లు చేశారు. తాజాగా విడుదలైన యానిమల్ ట్రైలర్‌ను చూసిన తర్వాత ప్రేక్షకులు మైండ్‌సెట్ మారిపోయింది. ట్రైలర్‌తో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది.
డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్... నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ (దూలపల్లి)లో సోమవారం (నవంబరు 27) సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. ఆ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. దీంతో వారిద్దరి ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
మహేశ్-జక్కన్న కాంబోలో #SSMB29 ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించి కథ ప్రీ ప్రొడక్షన్స్ దశలో ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా ఉన్నట్లు ప్రకటన వచ్చి చాలారోజులు అయింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.. నేడు వీరిద్దరూ ఒకే స్టేజి మీద కనిపించబోతుండటంతో సినిమా గురించి ఏమైనా చెబుతారేమో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment