పాన్ ఇండియా రేంజ్‌లో యానిమల్ కలెక్షన్స్ ఏ మాత్ర తగ్గడం లేదు. మొదటి రెండు రోజులకు గాను రూ. 236 కోట్లు రాబట్టిన ఈ సినిమా మూడోరోజు ఆదివారం కూడా కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్ కపూర్-రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూడు రోజుల కలెక్షన్‌ను యానిమల్ అధిగమించింది. కానీ అట్లీ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన జవాన్ చిత్రం సృష్టించిన రికార్డును దాటలేకపోయింది. మొదటి మూడు రోజుల్లో జవాన్ చిత్రం రూ. 384 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కానీ యానిమల్ చిత్రం మాత్రం మూడు రోజుల్లో రూ. 356 కోట్లు రాబట్టింది. పఠాన్ తొలి మూడురోజుల్లో రూ.313 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా యానిమల్ ప్రస్తుతానికి రెండు స్థానంలో ఉంది.
ఆదివారం, యానిమల్ హిందీ మార్కెట్‌లో యానిమల్ ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. రోజులు గడిచే కొద్ది ఈ సినిమాకు పెరుగుతున్న రెస్పాన్స్ వల్ల థియేటర్‌లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ. 356 కోట్లు ఉండగా దేశీయ నికర వసూళ్లు రూ. 203 కోట్లు అని సినీ ట్రేడ్ వర్గాలు వెళ్లడించాయి. ఏదేమైనప్పట్టి యానిమల్ రూ. 800 కోట్ల మార్కెట్‌ను చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
♦ ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ 355.65 కోట్లు ( గ్రాస్)
► తెలుగు రాష్ట్రాలు- 40.05 కోట్లు
► తమిళనాడు - 4.45 కోట్లు
► కర్ణాటక -16.75 కోట్లు
► కేరళ- 1.30 కోట్లు
► బాలీవుడ్- 178.05 కోట్లు
► ఓవర్సీస్- 115.05 కోట్లు
BOX OFFICE TSUNAMI!#AnimalHuntBegins
— T-Series (@TSeries) December 4, 2023
Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani… pic.twitter.com/9cc66mS9c8
Comments
Please login to add a commentAdd a comment