యానిమల్‌ రెండో రోజు కలెక్షన్స్‌ సునామీ | Ranbir Kapoor And Rashmika Mandanna Animal Movie Day 2 Worldwide Box Office Collections, Deets Inside - Sakshi

Animal Day 2 Box Office Collections: యానిమల్‌ రెండో రోజు కలెక్షన్స్‌ సునామీ

Dec 3 2023 1:15 PM | Updated on Dec 3 2023 1:40 PM

Animal Movie Day-2 Collections - Sakshi

సొంతం చేసుకుంది.  రణ్‌బీర్ కపూర్‌- రష్మిక మందన్న కాంబినేషన్‌ ఈ సినిమాకు భారీగా ప్లస్‌ అయిందని చెప్పవచ్చు. పుష్ప తర్వాత రష్మికకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను యానిమల్‌ తీసుకొచ్చింది. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌  కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 116 కోట్లు రాబట్టింది. బాలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన జవాన్‌, పఠాన్‌ చిత్రాల తర్వాత యానిమల్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన  ఈ చిత్రం అన్నీ థియేటర్‌లల్లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతుంది. రెండో రోజు కూడా యానిమల్‌ కలెక్షన్స్‌ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో మొదటి రెండు రోజులు కలుపుకుని రూ. 236 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 

తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు రష్మిక, అనిల్ కపూర్‌, బాబీ డియోల్‌ యాక్షన్‌ రోల్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన యానిమల్‌ యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ ఫ్యామిలీతో ఈ సినిమా చూడటం కాస్త కష్టం  అంటూ విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాకు చిన్నపిల్లలతో  వెళ్లకండి అంటూ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement