Tickets rates
-
స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో చిత్రపరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా.. ఇతర చిత్రాలేవి పెట్టిన బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టిన బాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నారు. ఇక టాలీవుడ్లో సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పటికీ.. టికెట్ల రేట్లు థియేటర్లకి దూరం చేస్తున్నాయి. అలాగే కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు దూరం కావడానికి ఒక్క కారణమని చెప్పొచ్చు. (చదవండి: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ?) సూపర్ హిట్ చిత్రాలను సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తుండడంతో.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేర్స్‌కి వెళ్లడమే మానేశారు. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చులే అనే భావన వారిలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్స్ రప్పించడం కోసం నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యే ఎఫ్3 చిత్రానికి టికెట్లను రేట్లను పెంచకుండా.. ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేశాడు దిల్ రాజు. ఆయన బాటలోనే పలువురు నిర్మాతలు నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే... తాజా పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం కోసం సినిమా హీరోలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం పక్కా కమర్షియల్. తాజాగా ఈచిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లడం గోపిచంద్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు కూడా ఎక్కువే. ఈ మీడియా సమావేశానికి గోపిచంద్‌ని కచ్చింతంగా రప్పించండి అని నేను చెప్పాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగాలేదు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కూడా రావాలి. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అలా చేసువాల్సిన పరిస్థతి ఏర్పడింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోలపైన కూడా ఉంది. ఈ మధ్య ఓటీటీలో చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను ధియేటర్స్‌కు రావాలంటే.. హీరో, హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా హీరో, హీరోయిన్లు వచ్చి తమ సినిమాను ప్రచారం చేసుకోవాలి. మమల్ని(నిర్మాతలను) చూసి ప్రేక్షకులను థియేటర్స్‌కు రారు. హీరో హీరోయిన్లను చూసే వస్తారు’అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ మీట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కర్నూలులో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్ తొలిసారిగా స్టేజ్‌పై స్టెప్పులేసి ఫ్యాన్స్ అలరించాడు. అల్లు అరవింద్ పరోక్షంగానే మహేశ్‌బాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు. (చదవండి: సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు) అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. టికెట్ రేట్ల విషయానికొస్తే మల్టిప్లెక్స్, రిక్లైనర్, లార్జ్ స్క్రీన్ ఐమ్యాక్స్ వంటి థియేటర్లలో టికెట్‌పై రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతించినట్టు తెలిపారు. మిగిలిన నాన్ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. -
‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూవీ టీం షాకిచ్చింది. తెలంగాణలో గని మూవీకి సంబంధించి టికెట్ల ధరల్లో పెంపుదల లేదని తెలిపింది. పాత ధరల ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. పాత రేట్ల ప్రకారం అయితే.. మల్టీప్లెక్స్‌లో రూ. 250 నుంచి రూ. 200 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక గని మూవీ టికెట్ రేట్లలో పెంపుదల లేకపోడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్! కరోనా కారణంగా సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన గని మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా.. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
ఏపీలో టికెట్ల ధర విషయంలో నాకు ఇబ్బంది లేదు
‘‘ఏపీలోని సినిమా టికెట్ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి. టికెట్ల ధరలు పెరుగుతాయని సినిమాని జేబులో పెట్టుకుని కూర్చోలేం. నెంబర్స్ ప్రతి ఏడాది మారుతూనే ఉంటాయి. ఈ నెంబర్ గేమ్స్ నుంచి నేనెప్పుడో బయటకు వచ్చాను’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ – ‘‘ఇంత పెద్ద సినిమాను టైమ్‌కు రిలీజ్ చేయగలమా అనుకున్నాం. కానీ మా సినిమా రిలీజ్ డేట్‌ను నిన్ననే (మంగళ వారం) ఫిక్సయ్యాం. జనవరి 14న ‘బంగార్రాజు’ని విడుదల చేస్తున్నాం. సినిమా ఇంత తొందరగా ఎలా పూర్తయిందో నాక్కూడా తెలియడం లేదు. ఇందులో ఏదో సూపర్ పవర్ ఉంది. నా టీమ్ కృషి వల్లే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించగలిగాం. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్‌తో బిజీగా ఉండటం వల్లే నాగచైతన్య ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఇక ఈ సినిమా విడుదల గురించి నెగటివ్ ఆలోచనలు లేవు. నేనెప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకు వెళతాను. ముందుగా రిలీజ్ డేట్‌ను ప్రకటిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడటం బాధగా ఉంది. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు. అయినా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ ఉన్నా కూడా ‘బంగార్రాజు’ను విడుదల చేసేవాళ్లం. సంక్రాంతికి కనీసం మూడు సినిమాలు రావాలి. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా వచ్చినప్పుడు కూడా 4 సినిమాలు విడుదలయ్యాయి. నా కెరీర్‌కు ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, జానకిరాముడు’లా నాగచైతన్యకు ‘బంగార్రాజు’ ప్లస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాగార్జున. ‘‘ఈ సినిమాలో నాగార్జునగారికి, నాగచైతన్యలకు సమానమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రసాద్‌గారు నాకు సోదరుడు వంటివారు. బాగా సహకరించారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటలు అందించారు’’ అని కల్యాణ్ కృష్ణ అన్నారు. ‘‘నాగార్జునగారి ఎనర్జీని ఎవ్వరితోనూ మ్యాచ్ చేయలేం. చైతన్యతో పని చేయడం ఈజీ. సర్పంచ్ నాగలక్ష్మి (సినిమాలో కృతీ పాత్ర పేరు) పటాకాలా అనిపిస్తుంది. ఈ పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశాను’’ అని కృతీ శెట్టి అన్నారు. ‘‘బంగార్రాజు’ సినిమా ఆఫర్ మాకు రావడంతో ఇది నిజంగానే బంగారం లాంటి సినిమా అనుకున్నాం. నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించడంతో సినిమా ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది’’ అని జీ అధినేత ప్రసాద్ అన్నారు. ‘‘లడ్డుందా, వాసివాడి తస్సాదియ్యా’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘సోగ్గాడే..’లో ‘డిక్క డిక్క డుం డుం..’ పాటను నాగ్ సార్‌తో పాడించాం. ఇందులో కూడా పాడించాలని అనుకున్నాం. ‘లడ్డుందా...’ పాట విన్నాక మొత్తం పాడేస్తా అన్నారు నాగార్జునగారు’’ అని సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. -
నిర్ణీత రేట్లకే టికెట్ల విక్రయం.. రోజూ 4ఆటలు మాత్రమే: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ– సవరణ) బిల్లు’ను అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకు ముందు చర్చ సందర్భంగా బిల్లు ఉద్దేశాలను మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రేక్షకుల ఆదరణ ను కొందరు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావించారు. ఒక్కో టిక్కెట్‌పై ఇష్టారాజ్యంగా రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సినా చట్ట విరుద్ధంగా 6 – 8 షోలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక ఆటలు సాగవు.. చిత్ర పరిశ్రమలో కొందరు మాకు ఎదురు ఉండకూడదు.. ఏచట్టాలూ మమ్మల్ని ఆపలేవు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి నాని పేర్కొన్నారు. ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా టిక్కెట్లు విక్రయించే వ్యవస్థ తేవాలని నిర్ణయిం చిందన్నారు. బస్సులు, రైలు టికెట్ల మాదిరిగా సినిమా టిక్కెట్లను కూడా మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వివరించారు. గంట ముందు థియేటర్లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే అక్కడ కూడా ఆన్లైన్ విధానంలోనే థియేటర్ల యజమానులు టిక్కెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా, సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు థియేటర్ యాజమాన్యాలతో కలసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్ షోలకు అవకాశం ఉంటుందని తెలిపారు. -
నింగిలోకి దూసుకుపోవాలనుందా? అయితే మీకో ఆఫర్!
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ బృందం రోదసీ యానాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత స్పేస్ టూరిజంపై ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నింగిలోకి దూసుకెళ్లి అక్కడినుంచి భూమిని చూడాలన్న ఉత్సాహం, ఉత్సుకత అందరిలోనూ ఏర్పడింది. అయితే ఇది సామాన్య మానవుడికి అందని ద్రాక్షే. కోట్ల ఖరీదు చేసే ఈ అనుభవాన్ని సొంతం చేసుకోవడం ఒక్క శ్రీమంతులకే సాధ్యం. అంతరిక్షయానం చేయాలంటే 3 కోట్ల రూపాయలకు పైమాటే అంటోంది. వర్జిన్ గెలాక్టిక్. తమ స్పేస్ షిప్లో సీటు రిజర్వ్ చేసుకోవాలని పిలుపు నిస్తోంది. అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తాజాగా ఈ ఆఫర్ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.ఈ విమానంలో సీటు దక్కించుకోవాలంటే 450,000 (సుమారు రూ.3,33,82,682) డాలర్లు చెల్లించు కోవాలి. అంతేకాదు ఇందుకు మూడు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. సో.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద టికెట్లు అందబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ గురువారం తెలిపింది.వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండనుందని అంచనా. తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. కాగా జూలై 11న అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో బ్రాన్సన్ రోదసీలోకి దూసుకెళ్లాడు. ఈ యాత్రలో భాగంగా తెలుగు తేజం గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష మరో నలుగురున్నారు. ఆ తరువాత జూలై 20న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బృందం కూడా 'న్యూ షెపర్డ్' రాకెట్లో రోదసి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్జిన్ గెలాక్టిక్ ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యుఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నుండి వర్జిన్ గెలాక్టిక్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. -
'వకీల్‌సాబ్'కు వ్యతిరేకంగా చేసిన జీవో కాదు
సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్ చేశారు. ‘వకీల్‌సాబ్’ సినిమా 9న రిలీజ్ అయితే, ఆ జీవో 8న పాస్ అయ్యింది. ‘వకీల్‌సాబ్’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు. నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్‌సాబ్’ టికెట్ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్‌బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్ బంద్ అంటున్నారని తెలిసింది. ‘వకీల్‌సాబ్’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జె.వి. మోహన్ గౌడ్. -
అధిక ధరలకు టికెట్లమ్మితే భారీ జరిమానా
సాక్షి, అమరావతి: దసరా పండగ దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్‌కు ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రవాణశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ల రేటు పెంచినా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు. పండగ వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ గతంలోనూ అధికంగా రేట్లు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా దండుకున్నాయి. టీఎస్‌ఆరీ్టసీ సమ్మె దృష్ట్యా హైదరాబాద్, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులను ట్రావెల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పెడతారనే సమాచారంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. టికెట్ల ధర ఎంత వసూలు చేస్తే..అంతకు రశీదులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగ సీజన్లో పది రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నిరంతర తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. ఎక్కడైనా ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ల ధర భారీగా వసూలు, ఒకే పరి్మట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పితే.. ఒకసారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే మొదటి జరిమానాకు ఐదు రెట్లు అధికంగా జరిమానా విధించేలా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి. వాట్సాప్ నంబరుకు ఫిర్యాదులు.. ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలుకు, నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్ నంబరు 9542800800కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. -
హైదరాబాద్‌లో పెరిగిన సినిమా టికెట్ ధరలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ‘మహర్షి’సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్లు టికెట్ల ధరలు పెంచాయి. దీనికి థియేటర్ల యాజమాన్యాల సంఘం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ పెంపు 9వ తేదీ నుంచి రెండు వారాలపాటు అమలులో ఉంటుంది. నగరంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 చొప్పున పెంచుతున్నట్లు తెలిపాయి. కానీ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మాత్రం ఈ పెంపుదల రూ.62 వరకు ఉండటం గమనార్హం. కాగా, మహేశ్‌బాబుకు చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో మాత్రం ఇప్పటికే టికెట్‌పై రూ.200, రూ.300 వసూలు చేస్తుండటం గమనార్హం. మహర్షి సినిమాకు మాత్రం ఏఎంబీలో ఎలాంటి పెంపుదల లేదు. నగరంలో టికెట్ల రేట్లు పెంపుదలకు ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ వస్తున్న వార్తలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. మ హర్షి సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం టికెట్ల పెంపుదలకు ఎవరికీ ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. థియేటర్ పాత ధర కొత్త ధర సింగిల్ స్క్రీన్ రూ.80 రూ.110 మల్టీప్లెక్స్ రూ.130 రూ.180 ప్రసాద్ ఐమ్యాక్స్ రూ.138 రూ.200 -
సినీ తారలతో కలిసి నవ్వులు చిందించిన మోదీ
బాలీవుడ్ ప్రముఖలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ తారలు రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, కరణ్ జోహర్లతోపాటు మరికొందరు ప్రముఖులు గురువారం ఢిల్లీలో మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమలోని పలు సమస్యలపై మోదీతో చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా బాలీవుడ్ నటీనటులు మోదీతో కలిసి దిగిన ఫొటోను కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలో మోదీ తారల మధ్య నవ్వులు చిందింస్తూ కనిపించారు. ఈ రోజు ప్రధాని మోదీని కలవడం అద్భుతమైన అవకాశమని కరణ్ జోహర్ న్నారు. చర్చల ద్వారా గొప్ప మార్పు సాధించవచ్చని.. తాము దాని కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఒక కమ్యూనిటీగా దేశ ప్రగతి కోసం కృషి చేయాలనే ఆసక్తి తమకు ఉందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. View this post on Instagram Powerful and timely conversations can bring about change and this was one of what we hope will become a regular conversation. Meeting the Honorable Prime Minister @narendramodi today was an incredible opportunity. As a community, there is a huge interest to contribute to nation building. There is so much that we want to do. And can do and this dialogue was towards how and what ways we can do that. When the youngest country (in demography) joins hands with the largest movie industry in the world, we hope to be a force to reckon with. Together we would love to inspire and ignite positive changes to a transformative India. The film industry would also like to send a huge thanks for the GST reduction in movie ticket prices that was implemented recently! Thank you so much for your time, Sir! A post shared by Karan Johar (@karanjohar) on Jan 10, 2019 at 4:24am PST -
సమాచారమే సరిగా లేదు.. ఆన్లైన్ సేవలెలా?
రాజన్న ఆలయ సమాచారం కావాలా? ఐతే వెబ్సైట్ తెరిచి చూస్తే సరిపోతుందిలే! అనుకుంటే పొరపాటే. ఎందుకంటారా..? అందులోని సమాచారం మనల్ని తప్పుదోవ పట్టించొచ్చు మరీ!! ఈ తప్పుడు సమాచారాన్ని స్థానికులు చూసి నవ్వుకుంటున్నారు.తెలంగాణకు తలమానికమైన ‘వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం’ అఫీషియల్ వెబ్సైట్ తెరిస్తే చాలు గదుల సమాచారంతోపాటు పూజలు, వాటి వివరాలు, టికెట్ల రేట్లు.. ఇలా మొత్తం సమాచారం తప్పుగానే దర్శనమిస్తోంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్డేట్ చేయాల్సిన సదరు శాఖ మొద్దునిద్రను ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. ఏడాది క్రితం ఉన్న సేవలే కనిపించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. అప్పటి నుంచి తాజా సమాచారాన్ని ఇందులో పొందుపర్చలేదు. - న్యూస్‌లైన్, వేములవాడ ఫస్ట్‌కాస్ మొదలు.. పీజీ విద్యార్థులు.. నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ స్థాయి వరకు ఇంటర్నెట్పై ఆధారపడుతున్న రోజులివి. వెబ్సైట్ తెరిస్తేచాలు.. ప్రపంచం కనబడుతోంది. అయితే రాజన్న ఆలయ సమాచారం మాత్రం వెబ్సైట్ లో తప్పుగా చూపిస్తోంది. గతేడాది రూమ్‌ల అద్దె ధరలే ఇప్పటికీ దర్శనమిస్తున్నా యి. ఆర్జిత సేవలతోపాటు ప్రతిదీ రేట్లు పెరిగాయి. అయినా సైట్లో మాత్రం అలా గే ఉన్నాయి. గతేడాదికి.. ఇప్పటికీ ఆలయంలో అనేక మార్పులు వచ్చాయి. అయినా అధికారులు మాత్రం అప్డేట్ చేయడంలో శ్రద్ధ చూపించడం లేదు. ఏపీ ఆన్‌లైన్‌తో అనుసంధానం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఆర్జేడీ స్థాయి ఈవోల సమావేశంలో నూతనంగా చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలను దేవాదాయశాఖ కమిషనర్ వివరించారు. అందులో ప్రధానం ఏపీ ఆన్‌లైన్‌తో ప్రముఖ దేవాలయాల సమాచారాన్ని అనుసంధానించడం. భక్తులకు ఉచిత సేవచేసే ఉద్దేశంతో ఏపీ ఆన్లైన్ ఈతరహా సేవలకు సిద్ధపడినట్లు ఆయన ప్రకటించారు.ఆర్జిత సేవలూ, వసతి గదుల బుకింగ్ ఏపీ ఆన్లైన్ ద్వారా బుక్చేసుకునేందుకు వీలుగా సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈతప్పులతడక సమాచారాన్నే ఏపీ ఆన్‌లైన్‌లోనూ పొందుపరిస్తే అటు భక్తులకూ, ఇటు తక్కువ రేట్లకు సేవలు బుక్‌చేయటం వల్ల ఆలయానికీ నష్టం తప్పదన్నది ఇట్టే తేలిపోతుంది. అన్ని ఆన్లైన్లోనే.. ఏపీ ఆన్లైన్ అనుసంధానంతోపాటు మరో ఉత్తర్వునూ ఈవోలు అందుకున్నారు. ఇన్నాళ్లూ కాగితాలపై సాగిన ఉత్తరప్రత్యుత్తరాలు ఇకపై ఉండవు. ఆలయాల్లో చేపట్టనున్న ఏ అభివృద్ధి పనులనైనా ల్యాప్‌టాప్ సహాయంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సిందే. ఇందుకు అవసరమైన అన్నిరకాల శిక్షణనూ ఆయా దేవాలయాల ఈవోలు పొందాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంకేముంది రాష్ట్రంలోని 12 ప్రధాన ఆలయాల్లో ఒక్కటైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో సైతం రూ.50 వేలు వెచ్చించి నూతన ల్యాప్‌టాప్‌ను సమకూర్చుకున్నారు.