
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూవీ టీం షాకిచ్చింది. తెలంగాణలో గని మూవీకి సంబంధించి టికెట్ల ధరల్లో పెంపుదల లేదని తెలిపింది. పాత ధరల ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. పాత రేట్ల ప్రకారం అయితే.. మల్టీప్లెక్స్‌లో రూ. 250 నుంచి రూ. 200 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక గని మూవీ టికెట్ రేట్లలో పెంపుదల లేకపోడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్!
కరోనా కారణంగా సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన గని మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా.. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment