'నేనే వస్తున్నా' రిలీజ్ డేట్ ఫిక్స్.. సినిమాపై భారీ అంచనాలు | Dhanush Nene Vastunna Movie Released On 29th September In Telugu | Sakshi
Sakshi News home page

Dhanush Nene Vastunna Movie: ఈనెలాఖరులో థియేటర్లలో 'నేనే వస్తున్నా'

Published Wed, Sep 21 2022 8:07 PM | Last Updated on Wed, Sep 21 2022 8:18 PM

Dhanush Nene Vastunna Movie Released On 29th September In Telugu - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. తెలుగులో ఈ సినిమాను 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 29న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. 
(చదవండి: గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నేనే వస్తున్నా చిత్రం)

ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తెలుగులో చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ధనుష్‌కు తెలుగులో కూడా అభిమానుల ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాపై భారీ  అంచనాలు నెలకొన్నాయి. 'కాదల్ కొండేన్', 'పుదుపేట్టై', 'మయక్కం ఎన్న' సినిమాల తర్వాత ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది. తమిళంలో వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ నిర్మించగా.. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement