Geetha Arts Allu Aravind
-
పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు
తెలుగు ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్‌కు మంచి పేరు ఉంది. ఈ బ్యానర్లో భాగమైన GA2 నుంచి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్లో 'గీత గోవిందం' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్‌కు అనుగుణంగా వారి ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాస్. GA2 బ్యానర్లో ఆయన చాలా సినిమాలే తీశాడు. గీతగోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్‌తో జరిగిన వివాదం గురించి బన్నీ వాస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. 'గీత గోవిందం తర్వాత నాతో పరశురామ్ ఒక కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను విజయ్‌కు ఫోన్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈలోపు దిల్ రాజుతో పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెలిసింది. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. ఇదే విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం బాగానే బాధపడ్డాం. ఆ సమయంలో మేమంతా కొంచెం కోపంగా ఉన్నాం. అందుకు తగినట్లే పరుశురామ్‌పై రియాక్టయ్యాం. ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా సమయంలో ఏదో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పాను ఆయన సినిమా ఓకే చేయడం. ఆ తర్వాత విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇదే విషయం మీతో పొద్దున చెబుదామని అనుకున్నలోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. ఆ వివాదం తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి.. ఇదే సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో విజయ్- పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం.' అని బన్నీ వాసు పేర్కొన్నాడు. గతంలో ఏం జరిగింది..? గీతగోవిందం చిత్రం హిట్ కొట్టడంతో డైరెక్టర్ పరుశురామ్ చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయన వారి నుంచి కొంతమేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్లుగా గీతగోవిందం తర్వాత పరశురామ్ అల్లు అరవింద్‌కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ బ్యానర్లో నాగచైతన్య సినిమా తీసి వస్తానని అల్లు కాంపౌండ్ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కూడా మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా ఛాన్స్ దక్కడంతో నాగచైతన్య సినిమాను పక్కనపెట్టి మహేశ్- మైత్రీ మేకర్స్ వైపు మొగ్గుచూపాడు. ఆ సమయంలో 14 రీల్స్‌తో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సర్కారు వారి పాటలో 14 రీల్స్‌ను కూడా భాగం అయింది. సర్కారు వారి పాట చిత్రం తర్వాత కూడా దిల్ రాజు- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ప్యామిలీ స్టార్' చిత్రాన్ని పరుశురామ్ ప్రకటించాడు. దీంతో అల్లు అరవింద్‌కు కోపం వచ్చిందని ఇండస్ట్రీలో వైరల్ అయింది. గీతగోవిందం తర్వాత తమతో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఉండగానే దిల్ రాజుతో పరశురామ్ సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్‌కు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలిసింది. -
గీతా ఆర్ట్స్ నుంచి 'రష్మిక' లేడీ ఓరియంటెడ్ చిత్రం టైటిల్ రివీల్
నేషనల్ క్రష్ రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ నటి ఇప్పుడు ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడి ఓరియంటెడ్ సినిమాకు సిద్ధమైంది. 'చి.ల.సౌ' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా తెరకెక్కుతున్నట్లు రస్మిక ప్రకటించింది. ఈ మేరకు గ్లింప్స్‌ను కూడా మేకర్స్ వదిలారు. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయాననుకుని లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. రాహుల్ రవింద్రన్ లాస్ట్ సినిమా మన్మధుడు-2 అట్టర్ డిజాస్టర్. హీరోయిన్గా కెరియర్ టాప్ రేంజ్లో దూసుకుపోతున్న సమయంలో లేడీ ఓరియేంటేడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే రష్మిక చేస్తున్న పెద్ద సాహసమేనని చెప్పాలి. ఖుషీ ఫేమ్ అబ్దుల్ హేషమ్ వాహద్ సంగీత దర్శకుడిగా ఉండగా.. గీతాఆర్ట్స్, మాస్ మేకర్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ది 'గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం కూడా రష్మిక చేస్తున్న విషయం తెలిసిందే. 'రెయిన్ బో' అనే లేడీ ఓరియంటెడ్ సినిమాను ఆమె ఇప్పటికే ప్రారంభించింది.. ఈ చిత్రంతో శాంతరూబన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్ మోహన్ నటించనున్నాడు. -
Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్'ను హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. నేడు (జులై 6) టీజర్‌ను కూడా వదిలారు మేకర్స్.. 'కేజీయఫ్' బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో అన్ని భాషలలో భారీ బిజినెస్ జరగనుంది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇప్పటికే ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసేందకు భారీగానే పోటీ పడుతున్నారు. సలార్ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను అల్లు అరవింద్ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 50వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనుంది. అందుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అయితే, సలార్‌ను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారి నుంచి రైట్స్ కొనుగోలు చేయడం అంత సులభమైన విషయం కాదు. సలార్‌కు పెరుగుతున్న బజ్ కారణంగా సినిమా రైట్స్‌కు భారీగానే ధరను ఫిక్స్ చేస్తారు. లేదా కొన్ని షరతులతో మూవీ రైట్స్‌ను విక్రయిస్తారు. గతంలో కూడా KGF 2 తెలుగు హక్కులను వారు విక్రయించలేదు. కమీషన్ ఆధారంగా తెలుగులో విడుదల చేశారు. దాంతో భారీగానే లాభాలను పొందారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) అలాంటిది కేజీఎఫ్-2 రైట్స్‌నే అమ్మకపోతే సలార్ తెలుగు రైట్స్ అమ్ముతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అల్లు అరవింద్ వారిని ఒప్పించగలుగుతారా? అనేదానికి సమాధానం త్వరలో తెలుస్తుంది. అయితే, 'కాంతార' సినిమాను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్స్ వారే... ఇదే మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌నే. కాబట్టి వారితో అల్లు అరవింద్‌కు మంచిపరిచాయాలే ఉన్నాయి కాబట్టి సలార్ అవకాశం కూడా రావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. -
అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఆందోళన
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప- 2 మూవీ అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప రిలీజ్ అయి డిసెంబర్ 17 నాటికి ఏడాది పూర్తి కావొస్తోంది. సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద బైఠాయించారు. దీనిపై ఇంకా లేట్ చేస్తే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఐకాన్ స్టార్ బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలోని అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. ఆ డైలాగ్‌కు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్ప గెటప్‌లో కనిపించి అదుర్స్ అనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. -
ఇది అసలు ఊహించలేదు.. కాంతార హీరో రిషబ్ శెట్టి
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ , రిషబ్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. టాలీవుడ్లో మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. నేడు తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న థియేటర్లను కాంతారా చిత్రబృందం సందర్శించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: ‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!) హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ... 'ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు టాలీవుడ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...' సినిమాకు భాష ముఖ్యం కాదు.. కేవలం ఎమోషన్ ఒకటే ఉంటుంది అని కాంతార నిరూపించింది. ఈ సినిమాను కన్నడలో చూసి బన్ని వాసు నాతో చెప్పాడు. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశాం'. అని చెప్పారు. -
తెలుగులోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెలుగులోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’, ఆసక్తిగా ట్రైలర్
కన్నడ దర్శక-నటుడు, రచయిత రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతారా’. ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 30న రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ‘కాంతారా’ సినిమాను ఇతర భాషల్లోకి కూడా అనువదించి, రిలీజ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ ‘కాంతారా’ తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నారు. చదవండి: మనోజ్ సెకండ్ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్ కాగా గీతా ఫిలింస్ బ్యానర్ ద్వారా తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరివాళ్లకు ఇచ్చేశాడట’, ‘ధైర్యం.. ధైర్యం ఉండేది నీలో ఉన్న ఆవేశంలోనే.. కానీ నీలో ఉన్న ఆవేశం నీకు శత్రువు కాకూడదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
'నేనే వస్తున్నా' రిలీజ్ డేట్ ఫిక్స్.. సినిమాపై భారీ అంచనాలు
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. తెలుగులో ఈ సినిమాను 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 29న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. (చదవండి: గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేనే వస్తున్నా చిత్రం) ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తెలుగులో చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ధనుష్‌కు తెలుగులో కూడా అభిమానుల ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కాదల్ కొండేన్', 'పుదుపేట్టై', 'మయక్కం ఎన్న' సినిమాల తర్వాత ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది. తమిళంలో వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ నిర్మించగా.. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. -
పదిహేను వందల కోట్ల రామాయణం
చిన్నప్పటి నుంచి రామాయణాన్ని, అందులోని పాత్రలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అందులో కొన్ని ఘట్టాలను పలు పౌరాణిక సినిమాల్లో చూశాం. ఇప్పుడు పూర్తి స్థాయి రామాయణాన్ని 3డీలో తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉడయార్ ఈ లైవ్ యాక్షన్ 3డీ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. గతంలో 40 కోట్ల భారీ (అప్పటి మార్కెట్ వాల్యూ) బడ్జెట్‌తో ‘మగధీర’, బాలీవుడ్ మొదటి వంద కోట్ల చిత్రం ‘గజిని’ నిర్మించిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ భారీ రామాయణానికి ఓ నిర్మాత కావడం విశేషం. ఇప్పుడు 1500కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ సంస్థ ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రాతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మధు మంతెన నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు. ‘‘మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, పంజాబీ నటులు నటించనున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ‘రామాయణ్’ని రూపొందించబోతున్నాం. మూడు భాగాలుగా తెరకెక్కబోయే ఈ చిత్రం మొదటి భాగం 2021లో రిలీజ్ కానుంది. ఒక్కో భాగానికి 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. -
ఆనందంలో జీవీ
అతి పిన్నవయసులోనే సంగీత దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ తాజాగా కథా నాయకుడిగా అవతారమెత్తి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఈయన హీరోగా నటించిన చిత్రం డార్లింగ్. ఈయన సంగీత బాణీలు అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, స్టూడియో గ్రీన్ కె ఇ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మించారు. నవదర్శకుడు శ్యామ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిక్కి గర్లాణి నాయికిగా నటించారు. తెలుగు చిత్రం ప్రేమకథా చిత్రానికి రీమేక్ అయిన డార్లింగ్ అనూహ్యంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఐ, పూర్తి కమర్షియల్ కథా చిత్రం ఆంబళ చిత్రాలకు పోటీలో సంక్రాంతి బరిలోకి దూకింది. అంతగా భారీ అంచనాలు నెలకొన్న భారీ చిత్రాల మధ్య తొలి చిత్ర హీరో జి.వి.ప్రకాష్‌కుమార్ చిత్రం విడుదలవుతోందనగానే కొందరు వారికేమైనా పిచ్చా అనుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఐ, ఆంబళ చిత్రాల మధ్య నలిగిపోకుండా డార్లింగ్ బాగుందనే టాక్‌తో ప్రజాదరణ పొందుతోంది. లవ్ హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందిన డార్లింగ్ హిట్ టాక్ తెచ్చుకుంది. జి.వి.ప్రకాష్ నటుడిగా పాస్ అయ్యారు. చాలా మెచ్యూరిటీతో నటించారు. హారర్ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు శ్యామ్ కొత్తవాడైనా చక్కని కథనంతో ఆసక్తిగా చిత్రాన్ని తెరకెక్కించారనే ప్రశంసలు అందుకుంటున్నారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు జి.వి.ప్రకాష్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి పెన్సిల్‌తో త్వరలోనే అలరించడానికి రెడీ అవుతున్నారు.