గీతా ఆర్ట్స్‌ నుంచి 'రష్మిక' లేడీ ఓరియంటెడ్‌ చిత్రం టైటిల్‌ రివీల్‌ | Rashmika's 'The Girlfriend' Movie First Look Out | Sakshi
Sakshi News home page

Girlfriend First Look: గీతా ఆర్ట్స్‌ నుంచి 'రష్మిక' లేడీ ఓరియంటెడ్‌ చిత్రం టైటిల్‌ రివీల్‌

Published Sun, Oct 22 2023 1:37 PM | Last Updated on Sun, Oct 22 2023 1:49 PM

Rashmika The Girlfriend Movie First Look - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.  ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ అమ్మడు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో అలరించిన ఈ నటి ఇప్పుడు ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అనే లేడి ఓరియంటెడ్‌ సినిమాకు సిద్ధమైంది. 

'చి.ల.సౌ' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాహుల్ రవింద్రన్‌ దర్శకత్వంలో  'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా తెరకెక్కుతున్నట్లు రస్మిక ప్రకటించింది. ఈ మేరకు గ్లింప్స్‌ను కూడా మేకర్స్‌ వదిలారు. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయాననుకుని లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్‌ చూస్తే తెలుస్తుంది.  

రాహుల్ రవింద్రన్‌ లాస్ట్‌ సినిమా మన్మధుడు-2 అట్టర్‌ డిజాస్టర్‌. హీరోయిన్‌గా కెరియర్‌ టాప్‌ రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలో లేడీ ఓరియేంటేడ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమంటే రష్మిక చేస్తున్న పెద్ద సాహసమేనని చెప్పాలి. ఖుషీ ఫేమ్‌ అబ్దుల్ హేషమ్ వాహద్ సంగీత దర్శకుడిగా ఉండగా.. గీతాఆర్ట్స్‌, మాస్‌ మేకర్స్ బ్యానర్‌లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ది 'గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రంతో పాటు డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్‌లో మరో లేడీ ఓరియంటెడ్‌ చిత్రం కూడా రష్మిక చేస్తున్న విషయం తెలిసిందే.  'రెయిన్‌ బో' అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాను ఆమె ఇప్పటికే ప్రారంభించింది..  ఈ చిత్రంతో శాంతరూబన్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొమాంటిక్‌ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్‌ మోహన్‌ నటించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement