Actor Dhanush Naane Varuven Movie Telugu Version To Release In Geetha Arts Banner - Sakshi
Sakshi News home page

Dhanush-Geetha Arts Banner: గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో ధనుశ్‌ ‘నేనే వస్తున్నా’ చిత్రం

Published Wed, Sep 14 2022 6:45 PM | Last Updated on Thu, Sep 15 2022 8:55 PM

Geetha Arts Banner Release Dhanush Naane Varuven In Telugu - Sakshi

తమిళ స్టార్ హీరో ధనుశ్‌ తాజా చిత్రం ‘నానే వరువేన్‌’. ధనుశ్‌ సోదరుడు, డైరెక్టర్‌ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్‌-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేస్తున్నారు.

చదవండి: రణ్‌వీర్‌ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్‌! అసలేం జరిగిందంటే..

అయితే ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌తో కలిసి కలై పులి ఎస్‌ తను ఈ సినిమాను సమర్నిస్తున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. తాజాగా నిర్మాత కలై పులి గీతా అర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా నేను వస్తున్నా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెలలో(సెప్టెంబర్‌) విడుదల చేస్తామని, త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. కాగా యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్‌ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్‌, ఎల్లి అవ్రాయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement