
ఈ చిత్రం ఏ జానర్‌కు చెందిందో కరెక్ట్‌గా గెస్ చేస్తే వారితోనే టీజర్ రిలీజ్ చేయిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరింకే.. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు గతేడాది పెద్దగా కలిసి రాలేదు. తను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస దగ్గర పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వాసవ సుహాస సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండటంతో పాటు సినిమాకు మంచి హైప్‌నిచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమైన అప్‌డేట్ రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ బ్యానర్. వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌ను జనవరి 9న ఉదయం 10.15 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ చిత్రం ఏ జానర్‌కు చెందిందో కరెక్ట్‌గా గెస్ చేస్తే వారితోనే టీజర్ రిలీజ్ చేయిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరింకే.. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
Guess the genre, & you will be releasing the official teaser ✨
— GA2 Pictures (@GA2Official) January 5, 2023
Drop your comments on below link 👇https://t.co/pmKEMeROM9#VBVKTeaser on Jan 9th @ 10:15 AM#VinaroBhagyamuVishnuKatha ✨ #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram
A @chaitanmusic @kashmira_9 @KishoreAbburu pic.twitter.com/B1CBrfp1CY
చదవండి: