
Actress Rashmika Demands Rs 3 Cr from Geetha Arts: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది.
దీంతో పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతున్నట్లుంది.అందుకే పుష్ప సక్సెస్ తర్వాత నిర్మాతల నుంచి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా ఉమెన్ సెంట్రిక్ మూవీ కోసం గీతా ఆర్ట్స్ బ్యానర్ సంప్రదించినప్పుడు, రష్మిక జీఎస్టీతో కలిపి రూ. 3కోట్ల వరకు డిమాండ్ చేసిందట.
రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ పుష్ప సెకండ్ పార్ట్‌కి 3కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్.
Comments
Please login to add a commentAdd a comment