గేర్‌ మార్చిన విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Taxiwaala First Gear Out | Sakshi
Sakshi News home page

టాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌ వేసేశాడు

Published Fri, Mar 23 2018 5:32 PM | Last Updated on Fri, Mar 23 2018 5:37 PM

Vijay Devarakonda Taxiwaala First Gear Out - Sakshi

సాక్షి, సినిమా : టాలీవుడ్‌ సెన్సేషన్‌  విజయ్‌ దేవరకొండ తన తర్వాతి చిత్రం  టాక్సీవాలా ఫస్ట్‌ లుక్‌ ఇచ్చేశాడు. టాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌ పేరుతో ఓ చిన్న వీడియో బైట్‌ను వదిలారు. 

ఫుల్‌ జోష్‌తో టాక్సీలో దూసుకెళ్తున్న విజయ్‌ లుక్కును రివీల్‌ చేశారు. జేక్స్‌ బెజోయ్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఎస్‌కేఎన్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్‌ సంకృత్యన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ రోల్‌లో కనిపించబోతుండగా.. మాళవికా నాయర్‌, షార్ట్‌ ఫిలింస్‌ బ్యూటీ ప్రియాంక జవల్కర్‌లు  హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement