‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’ | Bhediya Film Is Releasing In Telugu under Geetha Film Distribution | Sakshi
Sakshi News home page

‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’

Published Wed, Nov 2 2022 3:31 PM | Last Updated on Wed, Nov 2 2022 3:51 PM

Bhediya Film Is Releasing In Telugu under Geetha Film Distribution - Sakshi

వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా తెరకెక్కిన హారర్‌ కామెడీ చిత్రం 'భేధియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. 

ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement