టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన 'నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఆదిపురుష్ చిత్రంలోనూ కనిపంచనుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది భామ. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి షెహజాదా చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి హాజరైన కృతి సనన్ ప్రత్యేక దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం కృతి ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట్లో చర్చ నడుస్తోంది. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆమె ధరించిన స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ధరించిన ఆ డ్రెస్ విలువు దాదాపు రూ.37,520 లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధర విని ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అంతకుముందు వరుణ్‌ధావన్‌తో కలిసి భేడియా చిత్రంలో నటించింది కృతి.
Comments
Please login to add a commentAdd a comment