భాగమతి కమింగ్‌ | Did you mean: bhagmati movie release next year jan 26 | Sakshi
Sakshi News home page

భాగమతి కమింగ్‌

Published Sat, Nov 18 2017 1:43 AM | Last Updated on Sat, Nov 18 2017 1:43 AM

Did you mean: bhagmati movie release next year jan 26 - Sakshi

డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తారా? గ్రాఫిక్స్‌ వర్క్స్‌ ఉన్నాయట కదా.. డిసెంబర్‌లో కష్టం. సంక్రాంతికి రేస్‌లో ఉంటుందేమో? ఊహూ.. సమ్మర్‌కి వస్తుందేమో? – ఇదిగో ఇలాంటి చర్చలే ‘భాగమతి’ సినిమా రిలీజ్‌ గురించి ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. ఆ చర్చలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయొచ్చు. ఎందుకంటే... ‘భాగమతి’ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో అనుష్క ముఖ్యపాత్రలో రూపొందుతున్న సినిమా ‘భాగమతి’.

ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘సూపర్‌ఫామ్‌లో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భాగమతి’ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్‌ లుక్‌కి వచ్చిన స్పందన చిత్రబృందానికి మంచి ఎనర్జీ ఇచ్చింది. దర్శకుడు అశోక్‌ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క నటన సినిమాకు హైలైట్‌. మథి కెమెరా వర్క్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తమన్‌ సంగీతం సూపర్‌. సినిమా  ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement