
కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. కొచ్చిలో సోమవారం రాత్రి మోదీతో వ్యక్తిగతంగా 45 నిమిషాలపాటు చర్చించారు. చిన్నప్పటి నుంచి మోదీని చూస్తూ పెరిగానని తాజాగా ప్రధానిని కలిసినందుకు తన ఆనందానికి అవధులు లేవని పేర్కొన్నాడు. ఈ మేరకు మోదీతో మాట్లాడిన అనుభూతిని పంచుకుంటూ సోషల్ మీడియాలో నటుడు ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
‘నా ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఇదే చాలా పవర్ ఫుల్ పోస్ట్. నా 14 ఏళ్ళ వయసు నుంచి మిమ్మల్నిచూస్తున్నాను. మిమ్మల్ని కలవాలనే కోరిక నేడు నిజమైంది. మీరు నన్ను గుజరాతీ భాషలో ‘కేమ్ చో భైలా’ అని పలకరించడం విని షాక్ అయ్యాను. మిమ్మల్ని కలిసి మీతో గుజరాతీలో మాట్లాడాలనేది నా జీవితంలోని పెద్ద కల. అది నేడు నెరవేరింది. మీతో మాట్లాడిన ఈ 45 నిమిషాలు నా జీవితంలోనే గొప్పవి. మీరు చెప్పిన ప్రతి మాట మర్చిపోలేను. మీరిచ్చిన ప్రతి సలహా ఆచరణలో పెట్టడంతోపాటు అమలు చేస్తాను” అంటూ మోదీతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.
కాగా మలయాళ నటుడైన ఉన్ని ముకుందన్.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత భాగమతి, ఖిలాడీ, యశోద వంటి సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించాడు. అయితే ముకుందన్ మలయాళ నటుడు అయినప్పటికీ అతని బాల్యం అంత గుజరాత్ అహ్మదాబాద్‌లోనే సాగింది. గుజరాత్‌లో దాదాపు 20 ఏళ్లు ఉన్నారు. అందుకే ముకుందన్‌ను మోదీ గుజరాతీలో పలకరించారు. ఇదిలా ఉండగా ఉన్ని ముకుందన్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మోదీతో భేటీ కావడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment