హనీమూన్‌కి వెళితే.. | Unni Mukundan and Sshivada new movie launch | Sakshi
Sakshi News home page

హనీమూన్‌కి వెళితే..

Published Fri, Nov 23 2018 6:02 AM | Last Updated on Fri, Nov 23 2018 6:02 AM

Unni Mukundan and Sshivada new movie launch - Sakshi

ఉన్ని ముకుందన్‌, శివదా నాయర్‌

‘జనతా గ్యారేజ్, భాగమతి’ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితులయ్యారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌. తాజాగా ఆయన నటించిన మలయాళ చిత్రం ‘చాణక్య తంతరమ్‌’. శివదా నాయర్‌ కథానాయికగా నటించారు. కణ్ణన్‌ తమెరక్కులమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘అశోక ది గ్రేట్‌’ పేరుతో కెవీఎస్‌ మూవీస్‌ పతాకంపై కల్లూరు శేఖర్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది.

హనీమూన్‌ కోసం అడవికి వెళ్లిన ఓ జంట తప్పిపోతారు. నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి, చంపేస్తారు. వారిపై భర్త ఎలా పగ తీర్చుకున్నాడు? ఉన్నత కుటుంబాలకు చెందిన ఆ యువకుల్లో ఒక్కొక్కర్ని చాకచక్యంగా ఎలా అంతం చేశాడన్నదే కథ. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌ మల్ల యుద్ధం, కత్తి యుద్ధం మాస్ట ర్‌గా కనిపిస్తారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కల్లూరు వెంకట సుబ్బయ్య, సంగీతం: రమేష్‌ పిషరోడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement