'జనతా గ్యారేజ్' ఫొటో బయటకు వచ్చింది | Mohanlal tweets Janatha Garage movie photo | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్' ఫొటో బయటకు వచ్చింది

Published Sun, Apr 3 2016 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

'జనతా గ్యారేజ్' ఫొటో బయటకు వచ్చింది

'జనతా గ్యారేజ్' ఫొటో బయటకు వచ్చింది

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'కు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఫొటోను తన ట్విటర్ పేజీలో పెట్టారు. మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తో తాను కలిసివున్న ఫొటోను ట్వీట్ చేశారు.

శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమాలో మోహన్ లాల్కు జోడిగా సుహాసిని నట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్ని ముకుందన్ భార్య పాత్రలో విదిశ కనిపిస్తుందని సమాచారం. విదిశ ఇంతకుముందు అత్తిలి సత్తిబాబు, మా ఇద్దరి మధ్య, దేవరాయ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్ నటిస్తున్నారు. కాగా, జనతా గ్యారేజ్ టీమ్ ఇటీవల ముంబై లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 'నాన్నకు ప్రేమతో' హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో 'జనతా గ్యారేజ్' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement