ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.
(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)
ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment